రూ.2 లక్షల వరకు: 2017లో చంద్రబాబు తొలి సంతకం, ఐటీ ఎంతున్నా ఆ మజా వేరు
అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంగ్ల నూతన సంవత్సరం 2017 తొలి రోజున ఆరోగ్య రక్ష పథకం ఫైలు పైన సంతకం చేశారు.
విజయవాడ: అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంగ్ల నూతన సంవత్సరం 2017 తొలి రోజున ఆరోగ్య రక్ష పథకం ఫైలు పైన సంతకం చేశారు. హెల్త్ ఫర్ ఆల్ పథకం కింద అందరికీ రూ.2 లక్షల వరకు ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
వైద్య రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయనీ, ఎలాంటి వ్యాధినైనా నొప్పి లేకుండా వైద్యం అందించే రోజులు వచ్చాయని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం సాధ్యమవుతుందన్నారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఫైలు పైన సంతసం చేశారు. ఈ పథకం కోసం ఫిబ్రవరి 28 వరకు పేర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
దీనిలో పేరు నమోదుకు ప్రతి వ్యక్తి నెలకు రూ.100ల చొప్పున చెల్లింపునకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం వల్ల ప్రతి వ్యక్తికి రూ.2లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం ఉంటుందన్నారు.
రాష్ట్రంలో ఉండే ప్రతి మనిషీ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజల్లో మానసిక ఒత్తిడి ప్రారంభమైతే ఆరోగ్యం దెబ్బ తింటుందన్నారు. ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు బాగుండాలన్నారు. పరిసరాలు బాగుంటే దోమలు రావనీ, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు దరిచేరవన్నారు.
హోటళ్లలో రోజూ తినండం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందన్నారు. పాజిటివ్‌గా ఆలోచించేవారి ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుందని, మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలుగుతారన్నార. టెన్షన్స్ వస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు.
ఐటీ ఎంత అభివృద్ధి చెందినా..
చంద్రబాబు విజయవాడలో బుక్ ఫెయిర్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐటీ ఎంతగా అభివృద్ధి చెందిన పుస్తకం చదివితే ఆ ఆనందమే వేరుగా ఉంటుందన్నారు. నిత్యం పుస్తకాలు చదివితే అనుభూతి వేరేలా ఉంటుందన్నారు. పుస్తకాలు మానసిక వికాసాన్ని ఇస్తాయన్నారు.












Click it and Unblock the Notifications