చంద్రబాబు: కృష్ణా జలాలే కాదు, టీ కూడా (పిక్చర్స్)

విజయవాడ: తెలంగాణ అంశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో ట్విస్ట్ ఇచ్చారు. శాసనసభ తీర్మానం తర్వాతే రాష్ట్ర విభజనకు పూనుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను ఆపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై దివాళాకోరు రాజకీయాలు వద్దని, ఇదేదో కాంగ్రెస్ సొంత వ్యవహారం అనుకోవద్దని, పూటకో మాట మాట్లాడి ఓట్లూ సీట్లూ కోసం రాజకీయాలు చేయకండని ఆయన అన్నారు.

ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపకుండా ఒక్క అడుగు ముందుకేసినా తెలుగువాడి తడాఖా ఏమిటో ఢిల్లీకి చూపిస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ భూస్థాపితం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. బుధవారం విజయవాడలో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. విభజన విషంలో సంప్రదాయాలను పాటించాల్సిందే, రాజ్యాంగ ఉల్లంఘనలు వద్దని ఆయన అన్నారు.

గద్దె యూత్..

గద్దె యూత్..

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృష్ణా బ్యారేజీ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో పాల్లొన్న సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు యూత్ ఇలా ప్రదర్శన నిర్వహించింది.

కంభంపాటితో బాబు ఇలా..

కంభంపాటితో బాబు ఇలా..

మహాధర్నాలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు పార్టీ నాయకుడు కంభంపాటి రామ్మోహన్ రావుతో మాట్లాడుతున్న దృశ్యం

పార్టీ నేతతో బాబు ఇలా..

పార్టీ నేతతో బాబు ఇలా..

మహాధర్నా కార్యక్రమంలో బుధవారం పార్టీ నాయకుడు చెబుతున్న విషయాలను చంద్రబాబు శ్రద్ధగా వింటున్న దృశ్యం

దండం పెడుతూ చంద్రబాబు..

దండం పెడుతూ చంద్రబాబు..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇలా దండం పెడుతూ కనిపిస్తే, పార్టీ నేత నన్నపనేని రాజకుమారి హల్‌చల్ చేస్తూ ఇలా కనిపించారు..

పార్టీ నేతల గ్రూప్ ఫొటో..

పార్టీ నేతల గ్రూప్ ఫొటో..

పార్టీ నాయకులతో నారా చంద్రబాబు నాయుడు ఇలా గ్రూప్ ఫోటొకు ఫోజులు ఇచ్చారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు.

కృష్ణా బ్యారేజీ వద్ద..

కృష్ణా బ్యారేజీ వద్ద..

కృష్ణా బ్యారేజీ వద్ద నారా చంద్రబాబు నాయుడు ఇలా కనిపించారు. దేవినేని ఉమామహేశ్వర రావు తదితరులను కూడా చిత్రంలో చూడవచ్చు.

ఎన్టీఆర్‌కు నివాళి..

ఎన్టీఆర్‌కు నివాళి..

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చంద్రబాబు

దేవినేని ఉమతో మంతనాలు..

దేవినేని ఉమతో మంతనాలు..

వేదికపై నారా చంద్రబాబు నాయుడు పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావుతో మాట్లాడుతూ ఇలా కనిపించారు

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై గరం

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై గరం

కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు.

తెలంగాణపైనా చంద్రబాబు..

తెలంగాణపైనా చంద్రబాబు..

తెలంగాణపై కూడా చంద్రబాబు మాట్లాడారు. శాసనసభ తీర్మానం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సమైక్య ముసుగు తొడుక్కున్న విభజనవాది జగన్‌తో ఒక పక్క, తెరాసతో మరోపక్క అంటకాగి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సోనియా తన సొంత జాగీరనుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో కూర్చుని ఈ మెయిల్స్ ద్వారా రాష్ట్రాన్ని విభజిస్తారా? అని ప్రశ్నించారు. తెలుగు వాళ్లతో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదని హెచ్చరించారు. తెలుగువారి దెబ్బ ఢిల్లీకి వినిపించే రోజు తప్పకుండా వస్తుందన్నారు. అత్తగారి పుణ్యమా అంటూ రాజకీయాలలో ప్రవేశించిన సోనియాకు దేశ రాజకీయ చరిత్ర ఏం తెలుసని ప్రశ్నించారు.

దేశం అంటే లెక్కలేనితనం, బాధ్యత తెలియని వ్యక్తి సోనియా అని ఆయన అన్నారు. ఎవరు డబ్బు ఇస్తే వారి మాట మాట్లాడుతుందని ఆరోపించారు. ఒక రోజు యూటీ అంటారని, మరో రోజు ఉమ్మడి రాజధాని అంటారని, ఏమిటీ పద్ధతి అని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దివాళాకోరు రాజకీయాలు చేస్తోందని, సమైక్యవాదం ముసుగు తొడుక్కుని విభజన వాదాన్ని ప్రోత్సహిస్తోందని చంద్రబాబు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+