మహిళా ఉద్యోగులకు చంద్రబాబు డబుల్ బొనాంజా ఆఫర్..!

ఏపీలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే మహిళా ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెడతామని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ఇవాళ మహిళా ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ ఒక దానిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 120 రోజులు అంటే నాలుగు నెలలు మాత్రమే ఇస్తున్నారు. వీటిని ఇప్పుడు 180 రోజులకు అంటే ఆరు నెలలకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న తరహాలోనే వీటిని 180 రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Chandrababu government enhanced maternity leave period to women employees to 180 days

మహిళా ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే ప్రసూతి సెలవు ప్రస్తుతం ఇద్దరు పిల్లల వరకూ మాత్రమే ఉండగా, ఈ లిమిట్ ను కూడా ఎత్తేస్తూ ప్రభుత్వం మరో నిర్యం తీసుకుంది. దీన్ని కూడా ఇదే జీవోలో వెల్లడించారు. తద్వారా ఎంతమంది పిల్లల్ని కన్నా ప్రసూతి సెలవులు మాత్రం యథావిథిగా వర్తించబోతున్నాయి.

రాష్ట్రంలో జనాభా పెంపుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎక్కుమంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు పదే పదే ప్రభుత్వ కార్యక్రమాల్లో చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్ధాయిలోనూ ప్రోత్సాహక చర్యల్ని ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులు పెంచడంతో పాటు ఈ సెలవులు పొందేందుకు ఇప్పటివరకూ ఉన్న ఇద్దరు పిల్లల పరిమితిని కూడా ఎత్తేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+