నారా లోకేష్ సంచలన నిర్ణయం, రాజకీయాలకు బ్రేక్ వేస్తానని క్లారిటీ, అంతే కథ

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో సమూల మార్పులు చేయాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు దూరం పెట్టి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు అతీతంగా వైస్ చాన్సలర్లను నియమిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన అన్ని విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్)లో తెలిపారు. విశ్వవిద్యాలయాలు సమూలంగా ప్రక్షాళన చేయాలని తమ కూటమి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలను తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Chandrababu Govt issued notification to appoint VCs of universities in Andhra Pradesh

అందులో భాగంగానే రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వైస్ ఛాన్స్ లర్లుగా నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ర్యాంకింగ్స్ మెరుగుపరచడం, పరిశోధనలపై దృష్టి సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని యూనివర్సిటీలను తీర్చిదిద్దుతామని అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్ లర్లు నియమించడానికి దరఖాస్తులు ఆహ్వానించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని యూనివర్సిటీలకు వైస్ చాన్స్ లర్లుగా పదవులు చేపట్టడానికి అర్హత ఉన్న విద్యావంతులు దరఖాస్తులు చేసుకోవడానికి ఈనెల 28వ తేదీ చివరి తేదీ అని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇతర శాఖలకు చెందిన అనేక మంది ఉద్యోగులను డిప్యుటేషన్ పై యూనివర్సిటీలోని కీలక పదవుల్లో నియమించారని ఆరోపణలు ఉన్నాయి.

గత వైసీపీ ప్రభుత్వం లో విద్యాసంస్థలను భ్రష్టు పట్టించారని, యూనివర్శిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దారని మంత్రి నారా లోకేష్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకు, విశ్వవిద్యాలయాలకు ఎలాంటి సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలను రాజకీయాల అతీతంగా విద్యావంతులను నియమిస్తామని మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇవ్వడంతో చాలామంది విద్యావంతులు కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+