బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ ..హ్యాట్రిక్ కొట్టేశారుగా..!

తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్ 3'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మోస్ట్ వ్యూస్ సిరీస్‌గా నిలిచిన మొదటి రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. భార్యల ఫ్రస్ట్రేషన్‌తో సతమతమయ్యే ముగ్గురు భర్తల కథతో సాగిన ఈ సిరీస్, ఇప్పుడు మరింత వినోదంతో మూడో సీజన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ
మొదటి రెండు సీజన్లు పూర్తి రియాల్టీకి దగ్గరగా సాగితే, ఈ మూడో సీజన్‌లో మేకర్స్ 'ఫిక్షనల్' అండ్ 'ప్యారలల్ యూనివర్స్' కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి సరికొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.రాహుల్ (అభినవ్ గోమఠం)బెంగళూరులో సాఫ్ట్ వేర్ జాబ్ పోయినా, ఆ విషయం భార్య మాధురి (పావని గంగిరెడ్డి)కి చెప్పలేక హైదరాబాద్‌లో దాగుడుమూతలు ఆడుతుంటాడు.గంటా రవి (ప్రియదర్శి) ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులన్నీ వృథా చేసి, భార్య హైమా (సుజాత) పోరు పడలేక గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతాడు. విక్రమ్ (చైతన్య కృష్ణ) భార్య రేఖ (దేవియాని శర్మ)తో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతాడు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే.. భార్య నుంచి తనే భరణం కోరతాడు.

Save The Tigers 3 Review A Grand Hat-Trick Hit For This Hilarious Family Entertainer

పెళ్లిళ్ల వ్యవస్థపై, భార్యల ప్రవర్తనపై తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఈ ముగ్గురి బూతులు.. స్వర్గంలో ఉన్న ఇంద్రుడి (వెన్నెల కిషోర్) చెవిన పడతాయి. దాంతో ఇంద్రుడు తన బంటు గుప్తా (గుండు సుదర్శన్)ను పిలిచి, వీరి సమస్యను పరిష్కరించమంటాడు. గుప్తా ఒక మాయ చేసి, ఈ మొదటి లోకంలో ఉన్న ముగ్గురు భర్తలను.. రెండో లోకం (ప్యారలల్ వరల్డ్) లో ఉన్న వారి డూప్లికేట్స్‌తో 'స్వాప్' (అటు ఇటు మార్పిడి) చేస్తాడు. రూపాలు ఒకటే అయినా గుణాలు వేరైన ఆ రెండో లోకంలో ఈ త్రయం ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మొదటి లోకానికి వచ్చిన ఆ ముగ్గురు ఏం చేశారు? అనేదే మిగతా ఆసక్తికరమైన కథ.

నటీనటుల పెర్ఫార్మెన్స్
ఈ సీజన్‌లో నటీనటులందరికీ రెండు విభిన్నమైన షేడ్స్ చూపించే అవకాశం దక్కడంతో అందరూ అద్భుతంగా నటించారు. అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ఈ ముగ్గురూ తమ కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో సిరీస్‌ను వన్-మ్యాన్ షోలా నడిపించారు. ముఖ్యంగా ఒక లోకంలో మంచివాడిగా ఉండే గంటా రవి, మరో లోకంలో ప్రజలను దోచుకునే దుర్బుద్ధి గలవాడిగా ప్రియదర్శి చూపించిన వ్యత్యాసం హైలైట్. సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి భార్యల పాత్రల్లో మరింత మెప్పించారు. అతిథి పాత్రల్లో ఇంద్రుడిగా వెన్నెల కిషోర్, గుప్తాగా గుండు సుదర్శన్, పోలీస్ ఆఫీసర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, అవినాష్, రోహిణి, హర్షవర్ధన్ తమ వంతుగా నవ్వులు పూయించారు.

విశ్లేషణ
క్రియేటర్స్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం అందించిన ఈ కాన్సెప్ట్‌ను డైరెక్టర్ శ్రీరామ్ ఎరగం ఎక్కడా పట్టు తప్పకుండా తెరకెక్కించారు. మొదటి మూడు ఎపిసోడ్‌లు పాత్రల పరిచయం, లోకాల మార్పిడితో సరదాగా సాగిపోతాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. మహిళా సాధికారత, భార్య అంటే భర్తకు బానిస కాదు అనే పాయింట్స్‌ను, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అండర్ స్టాండింగ్‌ను చాలా హుందాగా చూపించారు. నెగెటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని తీసుకోవాలనే అంతర్లీన సందేశం బాగుంది.విజయ్ నమోజు, డీఎస్ గౌతమ్ రాసిన డైలాగ్స్ కొన్ని చోట్ల ఓటీటీ ట్రెండ్‌కు తగ్గట్టు హద్దులు దాటినట్టు అనిపించినా.. కథా ప్రవాహంలో అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఓటీటీ కంటెంట్ అయినప్పటికీ అశ్లీలతకు తావు లేకుండా, కుటుంబమంతా కలిసి చూసేలా క్లీన్‌గా రూపొందించడం విశేషం. అజయ్ అరసాడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్‌కి మంచి ప్లస్ అయింది.

ప్లస్ పాయింట్స్
సరికొత్త 'వరల్డ్ స్వాపింగ్' కాన్సెప్ట్ ను తీసుకుని అభిమానులను అలరించారు. ప్రియదర్శి, అభినవ్, చైతన్యల నటన అద్భుతంగా ఉంది. నవ్విస్తూనే భార్యాభర్తల బంధంపై ఇచ్చిన సందేశం చాలా బాగుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సిరీస్ కు మేజర్ ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్
అక్కడక్కడా కాస్త హద్దులు దాటిన కొన్ని డైలాగ్స్
రియాలిటీ కంటే ఫిక్షన్ ఎక్కువగా ఉండటం

ఫైనల్‌గా
మొదటి రెండు సీజన్ల క్రేజ్‌ను నిలబెడుతూ 'సేవ్ ది టైగర్స్ 3' హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌లో కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూడదగ్గ పర్‌ఫెక్ట్ సిరీస్ ఇది.

రేటింగ్: 3.25/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+