Shiv Sena (UBT): ఉద్ధవ్ సేనలో చీలిక ఖరారు..! తేలిపోయిన ఎంపీల లెక్క..!

మహారాష్ట్రలో గత లోక్ సభ ఎన్నికలకు ముందు శివసేన(Shiv Sena) లో చోటు చేసుకున్న చీలిక తరహాలోనే ఇప్పుడు మరో చీలికకు రంగం సిద్దమైంది. గతంలో చీలిక తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేవలం ఆరు ఎంపీల్ని మాత్రమే గెల్చుకున్న శిండే నేతృత్వంలోని శివసేన కన్ను మరోసారి ఉద్ధవ్ సేన (Shiv Sena (UBT)) పై పడింది. దీంతో ఉద్ధవ్ సేనకు ఉన్న9 మంది ఎంపీల్లో మెజార్టీ ఎంపీల్ని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో ఆరుగురు ఎంపీల్ని విజయవంతంగా లాగేసుకున్నారు.

TMC Split: తృణమూల్ లో చీలిక- 50 ఎమ్మెల్యేల వేరుకుంపటి.! శివసేన తరహాలో..!
TMC Split: తృణమూల్ లో చీలిక- 50 ఎమ్మెల్యేల వేరుకుంపటి.! శివసేన తరహాలో..!

గత కొన్ని రోజులుగా శివసేన ఉద్ధవ్ వర్గానికి ఉన్న 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే సేనకు వెళ్లిపోతున్నారన్న ప్రచారం మొదలైంది. దీనిపై అటో ఇటో తేల్చేయడానికి సిద్దమైన ఉద్ధవ్ థాక్రే ఇవాళ ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మిగతా ఆరుగురు డుమ్మా కొట్టారు. దీంతో ఊహించినట్లుగానే ఉద్ధవ్ సేన మరోసారి చీలిపోయేందుకు రంగం సిద్దమవుతోంది. శివసేన (UBT) పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు.

Loyalty Test Fails 6 Shiv Sena UBT MPs Skip Meeting Defying Party Whip
టీఎంసీ, శివసేన బాటలో ఎస్పీ ? యోగీ మంత్రి బిగ్ హింట్..!
టీఎంసీ, శివసేన బాటలో ఎస్పీ ? యోగీ మంత్రి బిగ్ హింట్..!

ఈ సమావేశానికి ముగ్గురు లోక్‌సభ ఎంపీలు అరవింద్ సావంత్, రాజాభావు వాజే, అనిల్ దేశాయ్ హాజరయ్యారని, తాను రాజ్యసభ సభ్యుడిని, సమావేశానికి హాజరుకాని ఎంపీలు పార్టీ విప్‌ను ఉల్లంఘించినట్లు తేలిందన్నారు. అందుకే వారిపై చర్యలు ప్రారంభించామన్నారు. వారికి 'షోకాజ్' నోటీసు జారీ చేసి, వివరణ కోరతామని తెలిపారు. వారి సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న తాము స్పీకర్‌ను కలిసిన ఫోటో విడుదల చేశామని, ఒకవేళ మిగిలిన ఆరుగురు ఎంపీలు కూడా స్పీకర్‌ను కలిసి ఉంటే, దానికి సంబంధించిన ఫోటోను తమకు చూపించాలన్నారు. దీన్ని వ్యూహం అనరు, ఇది ద్రోహం. వారు ఇప్పటికీ తమ పార్టీ సభ్యులే, తమ పార్టీ గుర్తుపైనే గెలిచారన్నారు. వారు పార్టీ విప్‌ను ఉల్లంఘించి ఉంటే, చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ దేశ రాజకీయాలను, ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసింది, దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సంజయ్ రౌత్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+