తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై మురహరి పల్లి వద్ద జూన్ 18 గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లంతా గోదావరిఖని నుంచి కారులో హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది. దారిలో కొండగట్టు హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఓ లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మేడ్చల్ లో జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తుర్కపల్లి- మురహపల్లి వద్ద జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. దాంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబ్ నగర్ లో జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఓ కారుపై గోడ కుప్పకూలిన ఘటనలో కారులోని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారిని సమీప ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Telangana Horror Three Deadly Road Accidents in One Day Leave 8 People Dead Telanganaroad accidents

అయితే గోడ కూలిన ఘటన నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్లపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలతో పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరోవైపు వరుస ఘటనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+