జగన్ అడ్డాపై చంద్రబాబు సవాల్ : అక్కడి నుంచే ఎటాక్ : జమ్మలమడుగులో కీలక మలుపు..!!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. అయితే, రెండు పార్టీల అధినేతలను వారి సొంత ఇలాఖాల్లోనే దెబ్బ తీసేందుకు వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో కేవలం ఆయన ఒక్కరే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. ఇక, రానున్న ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును దెబ్బ తీయటానికి ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు.

జగన్ - చంద్రబాబు ఇలాఖాలపైనే గురి..
పెద్దిరెడ్డి సైతం ఈ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో.. కుప్పం పరిధిలో డెవలప్ మెంట్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ సొంత జిల్లా పైన చంద్రబాబు సైతం రివర్స్ అటాక్ ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో సీఎం సొంత జిల్లాలో 10 సీట్లలోనూ వైసీపీ అభ్యర్దులే గెలిచారు. ఇక, ఇప్పుడు ఇదే జిల్లాలోని బద్వేలు కు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ జీ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. త్వరలో నే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

బద్వేలు బై పోల్ తో మరో సారి..
ఇందు కోసం కడప జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు బద్వేలు అభ్యర్ధిని ప్రకటించారు. గతలంలో నామినేషన్ల గడువు ముగిసే వరకూ చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించే వారు కాదు. తిరుపతి ఉప ఎన్నిక సమయం నుండి తన విధానం మార్చుకున్నారు. బద్వేలు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఓబుళాపురం రాజశేఖర్ ను ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్ధిగా ఖరారు చేసారు. 2019 ఎన్నికల్లో వెంకట సబ్బయ్యకు 95482 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ధి రాజశేఖర్ కు 50,478 ఓట్లు వచ్చాయి.

అలర్ట్ అయిన చంద్రబాబు..
ఈ అభ్యర్ధి ఖరారు సమయంలో బద్వేలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తోనూ చంద్రబాబు మాట్లాడారు. ఆ తరువాత రాజశేఖర్ పేరు ఖరారు చేసారు. ఇప్పటి నుంచే అక్కడ ప్రచారం ప్రారంభించాలని సూచించారు. ఇక, కడప జిల్లాలో మరో ముఖ్యమైన నియోజకవర్గం జమ్మలమడుగు. అక్కడ 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఆ తరువాత ఆయన కుటుంబం మొత్తం టీడీపీకే మద్దతుగా నిలిచింది. 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు.

జమ్మలమడుగులో మారుతున్న సీన్..
అయితే, ఆయన సోదరులు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. కడప జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశమైన సమయంలో ఆదినారాయణ రెడ్డి బీజేపీలోనే ఉన్నా.. తాము మాత్రం టీడీపీతోనే ఉంటామని ఆది సోదరుడు నారాయణ రెడ్డి, సోదరుల కుమారులైన శివనాధ రెడ్డి, భూపేష్ రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబుకు హామీ ఇచ్చారు. దీంతో... భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి వ్యూహాత్మకంగా ముందడుగు వేసారు.
Recommended Video

రామసుబ్బారెడ్డికి చెక్.. ఆది సోదరుల నయా ప్లాన్..
రామసుబ్బారెడ్డి తిరిగి టీడీపీలోకి వచ్చినా అవకాశం లేదని చెప్పేందుకే ముందుగానే టీడీపీ నుంచి ఇన్ ఛార్జ్ ప్రకటన వచ్చేలా వ్యవహరించారు. అదే సమయంలో జమ్మలమడుగులో తమ వర్గం వైసీపీ వైపు చూడకుండా..తమ ఫ్యామిలీ టీడీపీలో ఉండటం ద్వారా తన వర్గాన్ని నిలుపుకోవటంతో పాటుగా..రామసుబ్బారెడ్డికి చెక్ పెట్టటమే ఆది వ్యూహంగా కనిపిస్తోంది. ఆయన బీజేపీలో కొనసాగుతూనే.. తన సోదరుల ద్వారా జమ్మలమడుగు టీడీపీ రాజకీయాల పైన తన నిర్ణయాలు ప్రభావితం అయ్యేలా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో..ఇప్పుడు జగన్ ఇలాఖాలో చంద్రబాబు అండ్ పార్టీ నేతలు వేస్తున్న రాజకీయ అడుగులను ఇప్పుడు వైసీపీ ఏ రకంగా తిప్పి కొడుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications