ఉద్యోగులకు షాక్, కేసీఆర్‌పై అసహనం: బాబు చెప్తుంటే శ్రద్ధగా లోకేష్(పిక్చర్స్)

విజయవాడ: 1400 మంది ఏపీ ఉద్యోగులను స్థానికత పేరుతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిందని, ఇది సరికాదని అన్యాయమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు.

విజయవాడలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన ర్వాత రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలని తాను కోరుకున్నానని, కానీ తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. కేసీఆర్ ప్రతిదానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి సహకరించట్లేదన్నారు.

ఏడాది పాలన ముగిసినందునే సెక్షన్ 8 అమలు కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం గవర్నర్‌కు పూర్తి అధికారాలు ఉంటాయని చెప్పారు. అసలు ఏపీ మంత్రులు, అధికారులపై తెలంగాణ ప్రభుత్వం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు.

కాగా, రంజాన్ మాసం సందర్భంగా ముస్లీంలకు బాబు కానుక ఇచ్చారు. చంద్రన్న సంక్రాంతి కానుకలా చంద్రన్న రంజాన్ తోఫా పేరుతో కానుక ఇచ్చారు. దీని కింత ప్రతి ముస్లీం కుటుంబానికి ఐదు కిలోల గోధుమ పిండి, రెండు కిలోల చక్కెర, కేజీ సేమియా అందజేస్తారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

వ్యవసాయరంగంలో 18 శాతం వృద్ధిరేటును సాధించేందుకు గాను చరిత్రలోనే తొలిసారిగా కృషి కేబినేట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కేబినేట్ వారానికి ఒకసారి సమావేశమై సమీక్ష నిర్వహిస్తుంటుందని చంద్రబాబు అన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

వ్యవసాయరంగంతో పాటు పండ్ల తోటల పెంపకం, పశు పోషణ, మత్స్య పరిశ్రమను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అవసరమైతే అదనపు నిధులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

నదుల అనుసంధానం, చెక్ డ్యాంలు, సరికొత్త ప్రాజెక్టులు నిర్మాణం ద్వారా వృథాగా పోయే నీటిలో ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకుని సాగు, తాగునీటికి పుష్కలంగా నీరు అందిస్తూ కరువు లేకుండా చేయడం ద్వారా ప్రజలందరి కళ్లల్లో ఆనందాన్ని చూడాలనేది తన ధ్యేయంగా ఉద్వేగంగా ప్రకటించారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

అవకాశం ఎక్కడ ఉంటే ఆంధ్రప్రదేశ్ రైతు అక్కడ ఉంటాడని, బళ్లారి వెళ్లినా ఉత్తర భారతదేశానికి వెళ్లినా వనరులు వెతుక్కుంటూ వెళ్లాడని, ముఖ్యంగా నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళుతున్నాడంటూ అసలు మనకు ఇక్కడే అన్ని రకాల వనరులున్నాయి, ఎక్కడికీ పోనవసరం లేదు, వ్యవసాయాన్ని లాభసాటి చేయటం కోసమే తొలిసారిగా ప్రాథమిక రంగ మిషన్‌ను రూపొందించటం జరిగిందన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

కాగా, నారా లోకేష్ సాదాసీదా దుస్తుల్లో, మెడలో పార్టీ కండువా, పార్టీ ఐడీ కార్డు, చేతిలో పెన్నూపేపర్‌తో సాదారణ కార్యకర్తలా కనిపించారు. విజయవాడలోని శేషసాయి కళ్యాణమండపంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.

తెలుగుదేశం

తెలుగుదేశం

ఈ సమావేశంలో నారా లోకేష్ సాధారణ కార్యకర్తలా కూర్చొని, చంద్రబాబు చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నారు. అవసరమైన వాటిని నోట్ చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+