బాబు ఫోన్ చేశారు, గెలుపు బీహార్‌కే చూడొద్దు: నితీష్, మేం కలిస్తే బిజెపి ఓడింది: లాలూ
పాట్నా: తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తదితరులు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.
బీహార్ ఎన్నికల్లో మహాకూటమి (కాంగ్రెస్, జెడియు, ఆర్జేడీ) విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ ఫోన్ చేసి అభినందనలు తెలపడం శుభపరిణామం అన్నారు. బీహార్ ఎన్నికల్లో గెలుపు కేవలం బీహార్ రాష్ట్రానికే పరిమితం కాదని నితీష్ అభిప్రాయపడ్డారు.

ఇది బీహార్ ప్రజల, బీహార్ ప్రజల ఆత్మాభిమానానికి విజయం అన్నారు. ఇంతటి గొప్ప విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు అన్నారు. దళితులు, మహాదళితులు, ఓబీసీలు, పేదలు అందరూ తమకు అండగా నిలిచారన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామన్నారు.
ఈ విజయం తమ కూటమిలోని కాంగ్రెస్, ఆర్జెడీ, జెడీయు... ఇలా ప్రతి ఒక్కరిదీ అన్నారు. ప్రచారంలో అన్ని అంశాలను పరిశీలించి ప్రజలు వివేకవంతమైన తీర్పు ఇచ్చారన్నారు. తమ కూటమిని ప్రజలు అంగీకరించారని చెప్పారు. ప్రతిపక్షాన్ని చులకన చేసే పని తాము ఎప్పుడూ చేయమని చెప్పారు.
బీహార్ ఎన్నికల ఫలితాలను కేవలం బీహార్ వరకే చూడవద్దన్నారు. బలమైన ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అర్థమవుతోందన్నారు. బలమైన ప్రత్యామ్నాయ అవసరం ఈ ఎన్నికలు ధృవపరుస్తున్నాయన్నారు. బీహార్ అభివృద్ధికి ప్రతిపక్షంతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు.
కూటమి నిర్ణయాలకు అనుగుణంగా నిబద్ధతతో పని చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రణాళికను ఉమ్మడిగా ప్రకటించాం, అలాగే చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని చెప్పారు. కేంద్రంతో సానుకూలంగా కలిసి పని చేయాలనేది తమ ఆకాంక్ష అన్నారు.
నితీష్ ముఖ్యమంత్రి: లాలూ
బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీష్ కుమార్ పగ్గాలు చేపడతారని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీహార్ ప్రగతికి ప్రజలు పట్టం గట్టారన్నారు. మహా కూటమికి బీహార్ ప్రజలు గొప్ప విజయం అందించారని చెప్పారు.
బీహార్ యువత మహాకూటమికి అండగా నిలిచిందన్నారు. నితీష్ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుందన్నారు. బీహార్ ప్రజలు బిజెపికి మంచి గుణపాఠం చెప్పారన్నారు. మోడీ నేతృత్వంలోని ఫాసిస్ట్ ప్రభుత్వానికి ప్రజలు గుణనపాఠం నేర్పారన్నారు. మేమంతా ఒక్కటయ్యాం, బిజెపి ఓడిందన్నారు.
బీహార్ అభివృద్ధికి మహా కూటమి నిరంతరం పని చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను నితీష్ నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. బీహార్ ప్రజలు తమను ఆకాశానికి ఎత్తారన్నారు. పేదలు, మైనార్టీలు, దళితులు, యువత తమకు అండగా నిలిచారని చెప్పారు.
తమకు విజయాన్ని అందించిన యావత్ బీహార్ ప్రజలకు అభినందనలు, ధన్యవాదాలు అన్నారు. ముఖ్యమంత్రి నితీష్‌కు ప్రధాని మోడీ అభినందనలు తెలపడం హర్షణీయమన్నారు. ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందన్నారు. నితీష్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ముందే చెప్పామన్నారు.
బీహార్ గెలుపు లాంతర్ పట్టుకొని వారణాసి దాకా వెళ్తామని చెప్పారు. బిజెపి ముమ్మరంగా ప్రచారం చేసినా ప్రజలు తమ పైన నమ్మకం ఉంచారని చెప్పారు. ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలాపై మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. పిడివాదులకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందన్నారు.
-
తప్పుకొన్న నితీష్ కుమార్- రాజీనామా: ఇకపై -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications