వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరానికి కీలక ఘట్టం: ‘అమరావతి దశ మార్చేసింది, మోడీని మరువలేం’

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వచ్చిన తర్వాత మన దశ మారిందని .. ఏ పనులు చేపట్టినా నిరాటకంగా సాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వచ్చిన తర్వాత మన దశ మారిందని .. ఏ పనులు చేపట్టినా నిరాటకంగా సాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం స్పిల్‌వే కాంక్రీట్‌ పనులకు ఆయన లాంఛనంగా శ్రీకారం చుట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం సహకారం వల్లే పోలవరం పనులు ఈ స్థాయికి చేరాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ మనకు అన్ని విధాలా సహకరించారని పేర్కొన్నారు. తొలి కేబినెట్ సమావేశంలోని పోలవరం ముంపు ఏడు మండలాలను ఏపీ కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేశారని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణంలో కేంద్ర సహకారం మరువలేనిదని చంద్రబాబు చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీకి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా 262 గ్రామాలు ముంపునకు గురవుతాయని .. కొత్త చట్ట ప్రకారం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం జలవిద్యుత్‌ కేంద్రంలో 80 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేయగలుగుతామని చెప్పారు. 2019లోపు ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అకింతం చేయాలనే ధృఢ సంకల్పంతో సాగుతున్నట్లు వెల్లడించారు.

పోలవరానికి సహకరించినవారందరికీ కృతజ్ఞతలు చెప్పిన చంద్రబాబు.. సహకారాన్ని ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ కొనసాగించాలని అన్నారు. ఏపీలోని ఐదు కోట్ల ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పోలవరం తెలుగుజాతికి వరమని అన్నారు. తన కలలను గోదావరి తల్లి తీర్చిందని అన్నారు. నదుల అనుసంధానంతో కరువును దూరం చేయవచ్చని అన్నారు.

Chandrababu launches spillway works of Polavaram project

పోలవరం పూర్తయితే ఏపీ కరువు పూర్తిగా తీరిపోతుందని చంద్రబాబు తెలిపారు. రాయలసీమను పట్టిసీమతో ఆదుకుంటున్నామని, రాళ్లసీమగా మారకుండా అడ్డుకుంటున్నామని ఆయన అన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని వాటర్ గ్రిడ్‌లా మార్చేస్తామని చెప్పారు.

రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన

రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు.. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన పిడుగురాళ్లలో శిలాఫలకాన్ని వీడియో లింక్‌ ద్వారా ఆవిష్కరించారు. దీంతో పాటు విశాఖ-తిరుపతి డబుల్‌ డెక్కర్‌ రైలు, గుంటూరు రైల్వేస్టేషన్‌లో వైఫై సౌకర్యం, విజయవాడలోని సత్యనారాయణపురంలో ఈటీటీసీ కొత్త హాస్టల్‌ భవనం సముదాయాన్ని ప్రారంభించారు.

విజయవాడలోని రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థను జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రైల్వే అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

సురేశ్‌ ప్రభు ప్రారంభించిన ప్రాజెక్టులతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఒకేరోజు ఆరు ప్రాజెక్టులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో వైఫై ప్రారంభించుకోవడం శుభసూచికమని అన్నారు.

విజయవాడలో ఆధునిక పద్ధతిలో రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ తీసుకొచ్చారని తెలిపారు. తిరుపతి-విశాఖ ఏసీ డబుల్‌ డెక్కర్‌ రైలుతో రాష్ట్రంలోని 9 జిల్లాలకు కనెక్టివిటీ వస్తుందన్నారు. విశాఖ వేదికగా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరూ కేంద్రానికి రుణపడి ఉంటారని చంద్రబాబు అన్నారు.

English summary
The Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, who is in upbeat after receiving NABARD loan of Rs 1981 crore first time in the country for an irrigation project, today commencing the spillway concrete works for Polavaram project, the most crucial phase of the project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X