వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి రోజు సింగపూర్ పరిశ్రమలశాఖ మంత్రి ఎన్. ఈశ్వరన్‌తో సమావేశమ్యయారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.

మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని సమావేశం అనంతరం చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు జె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆ తర్వాత 11 గంటలకు మెరీనా బే శాండ్స్‌ స్కై పార్క్‌కు వెళతారు. 11.15 గంటలకు అక్కడి నుంచి తిరిగి వస్తారు. అనంతరం సీఎల్సీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కూ టెంగ్‌ చైతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో సింగపూర్‌ సివిక్‌ డిస్ట్రిక్, మెరీనా బే శాండ్స్‌ స్కై పార్క్‌పై చర్చిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పోర్ట్‌ ఆఫ్‌ సింగపూర్‌ అథారిటీ ప్రాంతాన్ని పర్యటిస్తారు.

తర్వాత 4.30 గంటలకు సింగపూర్‌ నదికి.. 5.45 గంటలకు క్లాకే క్వేకు వెళతారు. సాయంత్రం 6.30 గంటలకు పెరుమాళ్‌ దేవాలయం వద్ద తెలుగు కమ్యూనిటీ ఫంక్షన్లో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సింగపూర్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

బాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు

బాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు

తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి రోజు సింగపూర్ పరిశ్రమలశాఖ మంత్రి ఎన్. ఈశ్వరన్‌తో సమావేశమ్యయారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.

బాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు

బాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు

నవ్యాంధ్ర రాజధాని నగరాన్ని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహుముఖ ప్రయోజనాలను ఆశించి సింగపూర్‌ పర్యటనకు వెళ్లారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తల బృందంతో మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన సింగపూర్‌ బయలుదేరి వెళ్లడానికి ముందు అభివాదం చేస్తున్న చంద్రబాబు.
 బాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు

బాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు


చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ సలహాదారు జె.సత్యనారాయణ, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ రావు తదితరులు ఉన్నారు.

 బాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు

బాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు


బిజినెస్‌ డెలిగేషన్‌లో అమర్‌ రాజా బ్యాటరీస్‌ ఎండీ, ఎంపీ గల్లా జయదేవ్‌, జీఎంఆర్‌ గ్రూప్‌నకు చెందిన బీవీఎన్‌ రావు, నవయుగ గ్రూప్‌ చైర్మన్‌ సి.విశ్వేశ్వరరావు, శ్రీ సిటీ చైర్మన్‌ శ్రీనిరాజు, బీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా చైర్మన్‌ బి.శ్రీనివాసరావు, మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఎండీ పీవీ కిష్ణారెడ్డి, ట్రాన్స్‌స్టోరీ ఇండియా లిమిటెడ్‌ ఎండీ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

 బాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు

బాబు సింగపూర్ పర్యటన: తొలిరోజు

సింగపూర్ బయలుదేరే సమయంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ రైలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా అంగీకరించిందని చెప్పారు. ఈ రైలు వ్యవస్ధ అభివృద్ధికి తమ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.

English summary
Andhra Pradesh Cheif minister Chandrababu leaves for Singapore over investments to Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X