జగన్, పెద్దిరెడ్డి మింగింది మొత్తం కక్కిస్తాం, రోజులు దగ్గరపడ్డాయి జాగ్రత్త, చంద్రబాబు ఫైర్!
ఆంధ్రప్రదేశ్ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని, ఇక్కడి ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని, అందుకే టీడీపీ, జనసేన, బీజేపీకి కూటమికి ఓట్లు వెయ్యాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు మనవి చేశారు. జగన్ ప్రభుత్వం మీద రగిలిపోతన్న ప్రజల్లో తిరుగుబాటు మొదలైయ్యిందని, ఆంధ్రప్రదేశ్ లో కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు.
ఎన్నికల ప్రచారంలో చివరి రోజు అయిన శనివారం చిత్తూరు నగరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు 49 సీట్లు ఇచ్చిన రాయలసీమకు జగన్ ద్రోహం చేశాడని చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలోని పదవులు అన్నీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బందువులకే కావాలని, వేరేవాళ్లకు పదవులు వస్తే పెద్దిరెడ్డి సహించలేడని చంద్రబాబు ఆరోపించారు.

తిరుపతిలో ఐఐటీ, ఐసర్ లాంటి విద్యాస్థతు తెచ్చామని, హైవేల విసర్తణకు కోసం అప్పటి మా ప్రభుత్వం కష్టపడి పనిచేసిందని చంద్రబాబు అన్నారు. అయితే జగన్ వచ్చిన తరువాత కొత్త కంపెనీలు ఒక్కటీ రాలేదని, ఉన్న కంపెనీలో వెళ్లిపోయాయని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నాయకుల అరాచకాలు చూసి తట్టుకోలేని పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడటానికి భయపడిపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
మేము అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దిరెడ్డి తిన్నదంతా కక్కిస్తానని, ఆరోజు త్వరలోనే వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. పేద ప్రజలకు రూ 10 ఇస్తున్న జగన్ అదే చేతితో వారి దగ్గర రూ 100 లాగేస్తున్నారని, పేదలు, బడుగు బలహీర వర్గాలను వైసీపీ ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తోందని, చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నారని, కరెంటు చార్జీలు పెంచేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

నేను పుట్టింది ఇదే చిత్తూరు జిల్లాలో అని, తనకు రాజకీయ జన్మనిచ్చి 45 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండటానికి కారణం అయిన చిత్తూరులోనే చివరి బహిరంగ సభ నిర్వహించాలని తాను ముందుగానే నిర్ణయించారని చంద్రబాబు అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆగడాలు అడ్డుకోవాలంటే చిత్తూరులో కూటమి అభ్యర్థులను గెలిపంచాలని చంద్రబాబు ప్రజలకు మనవి చేశారు. చిత్తూరులో జగన్ మోహన్ ను, ఎంపీగా ప్రసాదరావును గెలిపించాలని చంద్రబాబు మనవి చేశారు












Click it and Unblock the Notifications