చంద్రబాబు మేనిఫెస్టో, వైసీపీ ఓట్ బ్యాంకుపై గురి - అసలు పరీక్ష ఇదే..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమరశంఖం పూరించారు. వచ్చే ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ అని తేల్చి చెప్పారు. సీఎం జగన్ నమ్మకం పెట్టుకున్న సంక్షేమం పైనే గురి పెట్టారు. సంక్షేమ ఓట్ బ్యాంక్ ను తన వైపు మళ్లించే వ్యూహాలు ప్రారంభించారు. చంద్రబాబు ప్రకటించిన సంక్షేమం జగన్ ను మించి ఉందా అనేదే ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు సంక్షేమం ప్రకటించినా..వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రకటించిన ఈ మెనిఫెస్టో లో అసలు పరీక్ష చంద్రబాబు ఎదుర్కోనున్నారు.
చంద్రబాబు మేనిఫెస్టో:సీఎం జగన్ 2019 ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలోనే చంద్రబాబును టార్గెట్ చేసారు. అప్పుడే చంద్రబాబు విశ్వసనీయత పైన గురి పెట్టారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ప్రతీ సభలో చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరించారు. తన తండ్రి వారసత్వంగా విశ్వసనీయత తనకు ఉందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతీ ఇంటికి మంచి చేసామని..మంచి జరిగిందని నమ్మితేనే తనకు ఓటు వేయాలని జగన్ పిలుపునిస్తున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు అధికారంలోకి రావాలంటే జగన్ ను సంక్షేమంలో ఎదుర్కోక తప్పదని డిసైడ్ అయ్యారు.

వైసీపీ ఓట్ బ్యాంకు పై గురి:సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల్లో ప్రతీదీ మహిళలకే అందిస్తున్నారు. దీంతో మహిళా ఓట్ బ్యాంక్ లక్ష్యంగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో కీలక ప్రకటనలు చేసారు. ప్రతీ మహిళకు నెలకు రూ 1500 వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమం పథకాలు కొనసాగిస్తూ వీటిని అమలు చేస్తారా..లేక వీటిని మాత్రమే అమలు చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో ఇప్పటి వరకు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో ఏపీ మరో శ్రీలంక అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం టీడీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు తిరిగి అదే సంక్షేమం వైపు టర్న్ తీసుకుంది. అయితే, చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు జగన్ ఓట్ బ్యాంకును తన వైపు ఆకర్షించే స్థాయిలో ఉండాలంటే మరి కొన్ని మార్పులు తప్పవనే చర్చ మొదలైంది.
అసలు పరీక్ష అక్కడే:ఈ పథకాల అమలు పైన ముందుగా ప్రజల్లో నమ్మకం కలిగించటం చంద్రబాబుకు అసలైన సవాల్ గా మారనుంది. ముఖ్యమంత్రి జగన్ విమర్శలు ఎలా ఉన్న సంక్షేమం పేరుతో ప్రతీ నెలా ఏదో పథకం కిందం నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు కాలేదనే ప్రచారం ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడు అధికారం కోసం మరోసారి మేనిఫెస్టోలో చంద్రబాబు హామీలను ఇస్తున్నారని వైసీపీ ప్రచారం ప్రారంభించింది. తాము చెప్పింది చేసి చూపిస్తున్నామని..చంద్రబాబు కు విశ్వసనీయత లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమయంలో తాను చెప్పినది చేస్తానని నమ్మకం కలిగించటం చంద్రబాబు కు అసలైన పరీక్షగా మారుతోంది. మిత్రపక్షంగా పవన్ చెప్పినా..2014 అనుభవాలతో ఎంత వరకు మద్దతు లభిస్తుందనేదే అసలు ప్రశ్న. దీంతో..ఇప్పుడు చంద్రబాబు తాను చెప్పింది అమలు చేస్తానని నమ్మకం కలిగించేందుకు ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications