వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణ భారతీయులం: అన్నాడీఎంకే నేతతో బాబు, కాంగ్రెస్ సహా జాతీయ పార్టీ నేతలతో భేటీలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏపీ విభజన హామీలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం పార్లమెంటుకు చేరుకున్న చంద్రబాబు.. సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతోపాటు నేతలతో భేటీ అవుతున్నారు.

అంతకుముందు పార్లమెంటు వద్దకు వచ్చిన చంద్రబాబు నాయుడు మెట్లకు నమస్కరించి లోపలికి వెళ్లడం గమనార్హం. ఏపీకి అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు వివిధ జాతీయ పార్టీల నేతలను ఈ సందర్భంగా కోరారు.

మద్దతివ్వండి..

ముందుగా అన్నాడీఎంకే ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్‌తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాసం తీర్మానానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

మనం దక్షిణ భారతీయులం

మనమంతా దక్షిణ భారతీయులమని, ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వాలని వేణుగోపాల్‌కు విన్నవించారు. తమ పార్టీ అధిష్టానంతో చర్చించి, దీనిపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబుకు వేణుగోపాల్ తెలిపారు.

ఫరూక్ అబ్దుల్లాతోపాటు ఇతర నేతలతో భేటీ

అనంతరం, పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో చంద్రబాబు నాయుడు వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ, రాజీవ్ సాతీవ్, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ లను కలిసి చర్చించారు.

శరద్ పవార్‌తో ప్రత్యేకంగా చర్చ, కాంగ్రెస్ ఎంపీలతోనూ

ఇంకా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్రంపై తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏపీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సుప్రియా సూలే, కాంగ్రెస్ ఎంపీ సచిన్ పైలట్‌లను కూడా చంద్రబాబు కలిసి చర్చించారు. వీరితోపాటు తారిక్‌ అన్వర్‌, అనుప్రియ పటేల్‌, హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ లను కలిశారు.

‘కొత్త శత్రువులకు నమస్కారం': టీడీపీ వర్సెస్ బీజేపీ, ‘సోము ఓ శకుని! బాబు చెప్పినవారే ప్రధాని'‘కొత్త శత్రువులకు నమస్కారం': టీడీపీ వర్సెస్ బీజేపీ, ‘సోము ఓ శకుని! బాబు చెప్పినవారే ప్రధాని'

బాసటగా ఉండండి..

బాసటగా ఉండండి..

విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను చంద్రబాబు వారికి అందజేశారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేకహోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ తమకు బాసటగా నిలవాలని వారికి విజ్ఞప్తి చేశారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Tuesday met AIADMK MP Venugopal and few party leaders like Sharad Pawar and farooq abdullah and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X