నిశిత్ మృతి బాధ కలిగించింది: నారాయణను పరామర్శించిన బాబు, హరికృష్ణ

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణను సీఎం చంద్రబాబునాయుడు శనివారం పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ కుమారుడు నిషిత్‌ నారాయణ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నిషిత్‌ మరణం తనను బాధించిందన్నారు.

ఈ ప్రమాదం ఊహించనది అని పేర్కొన్నారు. నిషిత్‌ ఆత్మకు శాంతికలగాలని కోరుకున్నారు. నారాయణ విద్యాసంస్థలను నిషిత్‌ సమర్థంగా నిర్వహించారని, చేతికొచ్చిన సమయంలో కుమారుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. నారాయణను అధైర్యపడవద్దని సూచించారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొవాలని ఆయనకు సూచించినట్లు బాబు చెప్పారు.

chandrababu met minister narayana, says condolance to his son death
 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి ఉన్నారు. అమెరికా నుంచి తిరిగివచ్చిన వెంటనే చంద్రబాబు మంత్రి నారాయణను కలిసేందుకు నెల్లూరు వెళ్లారు. ఆయనతోపాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నారాయణను పరామర్శించారు.

సినీనటుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కూడా మంత్రి నారాయణను పరామర్శించారు. కొడుకును కోల్పోయిన బాధ ఎలావుంటుందో తనకు తెలుసని అన్నారు. ఈ సమయంలో మంత్రి నారాయణకు మనో ధైర్యం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu met minister narayana on Saturday to expressed his condolence to Nishit death.
Please Wait while comments are loading...