ఏపీలో జపాన్‌కు సిటీ: బాబు హామీ, వరికి టెక్నాలజీ
హైదరాబాద్: ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన జపాన్ పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక నగరాన్ని నిర్మించనుంది. అక్కడి నుండి భారీగా పెట్టుబడులు రానున్నాయి. దీంతో వారి కోసం ప్రత్యేక పారిశ్రామిక సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. చంద్రబాబుతో జపాన్ పర్యటన సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తల ప్రతిపాదన మేరకు విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ మార్గంలో ప్రత్యేక పారిశ్రామిక నగరాలు నిర్మించాలన్న ప్రస్తావన వచ్చింది.
విదేశీ పెట్టుబడుల కోసం నాలుగు కారిడార్‌లు కేటాయించాలని భావించారు. ప్రభుత్వం అవసరమైన భూములు కేటాయిస్తే, అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ కాలనీలు నిర్మిస్తారు. ఆయా కారిడార్‌లను అభివృద్ధి చెందిన నగరాలుగా చేస్తారు. ఇందులో భాగంగా బుధవారం జపాన్ అంతర్జాతీయ ఆర్థిక సహకార సంస్థ (జకా) ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సహకరిస్తామని వారు చెప్పారు.

చంద్రబాబుతో జైకా ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక దృష్టి సారించిన జపాన్ పెట్టుబడిదారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక నగరాన్ని నిర్మించనుంది. అక్కడి నుండి భారీ ఎత్తున పెట్టుబడులు రానున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పారిశ్రామిక నగరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది.

చంద్రబాబుతో జైకా ప్రతినిధులు
సీఎం చంద్రబాబు నాయుడుతో జపాన్ పర్యటన సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తల ప్రతిపాదన మేరకు విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ మార్గంలో ప్రత్యేక పారిశ్రామిక నగరాలు నిర్మించాలన్న ప్రస్తావన వచ్చింది. విదేశీ పెట్టుబడుల కోసం నాలుగు కారిడార్‌లు కేటాయించాలని భావించారు.

చంద్రబాబుతో జైకా ప్రతినిధులు
ప్రభుత్వం అవసరమైన భూములు కేటాయిస్తే, అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ కాలనీలు నిర్మిస్తారు. ఆయా కారిడార్‌లను అభివృద్ధి చెందిన నగరాలుగా చేస్తారు.

చంద్రబాబుతో జైకా ప్రతినిధులు
ఇందులో భాగంగా బుధవారం జపాన్ అంతర్జాతీయ ఆర్థిక సహకార సంస్థ (జకా) ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సహకరిస్తామని వారు చెప్పారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుధవారం నాడు ఇక్రిశాట్ ప్రతినిధులు, తదితరులు సచివాలయంలో కలిశారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుధవారం నాడు ఇక్రిశాట్ ప్రతినిధులు, తదితరులు సచివాలయంలో కలిశారు.
మరోవైపు, జపాన్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ వరి ఉత్పాదకతను పెంచడానికి జపాన్ బృందం అధ్యయనం చేస్తోంది. ఇందుకు ఈ బృందం ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జపాన్‌లో పర్యటించిన తర్వాత రాష్ట్రంలో వరి ఉత్పత్తిని పెంచడంపై ఆ దేశం దృష్టి పెట్టింది.
జపాన్‌కు చెందిన ఫుఖాసక నాయకత్వంలో పదిమంది నిపుణులు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఆయనతోపాటు కామియా, త ఖాహాషియా, మత్సుర, యోషినో, షింజు, సంపత్‌కుమార్, టి.జితేంద్ర, రాజశేఖర్, చైతన్య, మంగరాజు ఈ బృందంలో ఉన్నారు. ఈ బృందం గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించనుంది. వరి ఉత్పత్తిని పెంచడానికి తగిన చర్యలు తీసుకోనుంది.












Click it and Unblock the Notifications