చంద్రబాబు నాయుడు తీహార్ జైలుకు వెళ్లడం ఖాయం... హిందీ నేర్చుకుంటే మంచింది : విష్ణువర్థన్ రెడ్డి
టీడీపీలో చంద్రబాబు, లోకేష్‌లు మినహా ఎవరు మిగలరని బీజేపీ నేతల జాతీయ పార్టీ ఉపాధ్యాక్షుడు విష్ణువర్థన్ రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ ఇప్పటికే తెలుగు దోంగల పార్టీగా పేరుపోందిందని ఆయన విమర్శించారు. ఈ సంధర్భంగా ఆయన చేసిన ఆక్రమాలను నిగ్గు తేల్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
చంద్రబాబు చేసిన నేరాల్లో ఆయన తిహార్ జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. ఇందుకోసం వారు హిందీ భాషను నేర్చుకుంటే మంచిందని ఆయన హితవు పలికారు. ఇప్పటికే టీడీపీ మిత్రపక్షమైన కాంగ్రెస్ నేతలు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని గుర్తుచేశారు.

ఇక చంద్రబాబు ఉంటున్న కరకట్ట నిర్మాణంపై అక్రమమని ఆయన అన్నారు. ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేశ్ అతిథి గృహం సహా కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన 3 భవనాలకు సీఆర్‌డీఏ తుది నోటీసులు జారీ చేసింది.
నదీ పరిరక్షణ చట్టం, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపారని వీటి యజమానులకు గతంలోనే నోటీసులిచ్చి వివరణ కోరిన విషయం తెలిసిందే. దానికి వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో శుక్రవారం లింగమనేని రమేశ్, పాతూరి నాగభూషణం, ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ భవనాలకు తుది నోటీసులిచ్చిన విషయం తెలిసిందే...












Click it and Unblock the Notifications