22కి చేరిన మృతుల సంఖ్య: 'భయం వద్దు.. నేనున్నా'.. ఆసుపత్రిలో బాబు ఇలా!
ఎంత ఖర్చయినా ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని హామి ఇచ్చారు.
Recommended Video

అమరావతి: కృష్ణానది బోటు ప్రమాదాన్ని టీడీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా స్పష్టం చేశారు.
ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. అత్యంత దురదృష్ఠకరమైన ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ రిపీట్ అవకుండా.. అదే సమయంలో పర్యాటకులకు భరోసా ఇచ్చేలా సేఫ్టీ వాటర్ టూరిజం కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

22కి చేరిన మృతుల సంఖ్య:
బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికి తీయగా.. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆ రెండు మృతదేహాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
కాగా, సోమవారం నాడు బోటు ప్రమాద ఘటనను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అంతకుముందు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. బోటు తిరగబడిన ప్రదేశాన్ని, గాలింపు చర్యలను పరిశీలించారు. సహాయ చర్యల విషయమై కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తానున్నానని భరోసా:
సంఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం మంత్రులు దేవినేని ఉమ, భూమా అఖిలప్రియ, కామినేని శ్రీనివాస్ ను వెంటబెట్టుకుని సీఎం గొల్లపూడిలోని ఆంధ్ర ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. మొదట ఐసీయూలో చికిత్స పొందుతున్న భూలక్ష్మి, శ్రీలక్ష్మిలతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, తానున్నానని భరోసా ఇచ్చారు. అంతేకాదు, ఎంత ఖర్చయినా ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని హామి ఇచ్చారు.

బంధువులకు ఓదార్పు:
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల బంధువులను సీఎం చంద్రబాబు ఓదార్చారు. క్షతగాత్రులకు ఏమి కావాలన్నా తాము చూసుకుంటామన్నారు. అలాగే ఎంత ఖర్చయినా తామే భరించి ప్రాణాలు కాపాడుతామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రి వైద్యుల పనితీరును ఆయన ప్రశంసించారు. అవసరమైతే మరింతమంది నిపుణులైన డాక్టర్లను పిలిపించాలని సూచించారు.

అనుమతుల్లేని బోట్ల రద్దు
అనుమతుల్లేని బోట్లు అన్నింటినీ తక్షణమే రద్దు చేస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రకటించారు. ఇకనుంచి బోట్లకు లైసెన్సులు జలవనరుల శాఖ, పర్యాటక శాఖ సమన్వయంతోనే జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్సులకు అమలు చేస్తున్న సురక్షిత నిబంధనలను బోట్లకు కూడా అమలుచేస్తామని చెప్పారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications