'కరుణానిధి ఎన్టీఆర్‌తో చాలా సన్నిహితంగా ఉండేవారు, ఆయనతో విశేష అనుభవం'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో బుధవారం జరిగిన నోడల్ అధికారుల రాష్ట్రస్థాయి సమావేశంలో కరుణానిది మృతికిపై తీర్మానం చదివి వినిపించారు. తమిళనాడును అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆయన సేవలు అసమానమని ప్రశంసించారు.
సభికులతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. తమిళ ప్రజలు, కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కరుణానిధి రాటుదేలిన రాజకీయవేత్త అన్నారు. కోట్లాది మందిని ప్రభావితం చేసారన్నారు. తమిళనాడులో తిరుగులేని నేత అన్నారు.

దక్షిణ భారతదేశంలో పెద్ద రాజకీయ శక్తిగా ఇన్నేళ్ల పాటు కొనసాగారని, రాజకీయ రంగంతో పాటు కళా రంగంలోను తనదైన ముద్ర వేశారన్నారు. ఎన్నో సామాజిక మార్పులకు నాంది పలికారన్నారు. కరుణానిధితో తనకు మంచి అనుభవం ఉందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుతో ఆయన చాలా సన్నిహితంగా మెలిగేవారన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు కరుణ అండగా నిలిచారన్నారు. ఆయన మృతి దేశానికి, తమిళనాడుకు తీరని లోటు అన్నారు.
అత్యుత్తమ రాజకీయ నాయకుడిని కోల్పోయామని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కరుణ మరణం రాజకీయాలకు మాత్రమే కాదని, చిత్రసీమకు తీరని లోటు అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో ఆయనకు విశేషమైన అనుభవం ఉండేదన్నారు.
80 ఏళ్ల రాజకీయ అనుభవం, ఐదుసార్లు సీఎంగా, 13సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం మామూలు విషయం కాదన్నారు. అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
-
చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications