రెడ్డి నీకు వడ్డీతో సహ చెల్లిస్తా, చంద్రబాబు, ఈ పెద్దిరెడ్డి ఎయిడ్స్ కంటే ప్రమాదకరం, మాజీ సీఎం!
పెద్దిరెడ్డి నీ కథ చూస్తా, నీ అంతు చూస్తా, మీకు నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపిస్తా, నా కార్యకర్తలను ఎలా క్షోభ పెట్టావో, మీకు అంతే క్షోభ పెడతా అంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆవేశంగా అన్నారు. చిన్నాపెద్ద, ఆడామగ అని తేడా లేకుండా అందరిపట్ల వైసీపీ నాయకులు రాక్షలకంటే ఘోరంగా ప్రవర్థిస్తున్నారని, అందరికి వడ్డీతో సహా చెల్లిస్తానని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శపథం చేశారు.
పుంగనూరు, తిరుపతిలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుని తీవ్రస్తాయిలో ఆరోపణలు చేశారు. గత ఏడాది తాను, టీడీపీ కార్యకర్తలు అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి పూతలపట్టు వెలుతుంటే మార్గం మధ్యలో పుంగళూరులో పెద్దిరెడ్డి తన అనుచరులతో తన మీద, టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేయించారని, నా జీవితంలో ఆనాటి సంఘటన మరిచిపోనని చంద్రబాబు అన్నారు.

అంగళ్లు, పుంగనూరులో మా మీద వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోకుండా మా మీద రివర్స్ కేసులు పెట్టారని సుమారు 450 మంది టీడీపీ కార్యకర్తలు, అమాయకులను జైల్లో పెట్టారని, ఆ విషయం తన ప్రాణం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటానని, అంతకు అంత మీకు రిటన్ గిఫ్ట్ ఇస్తానని మాజీ సీఎం చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని హెచ్చరించారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 160కి పైగా ఆలయాలపై దాడులు చేశారని, వైఎస్ జగన్ అండతోనే వైసీపీ మూకలు రెచ్చిపోయారని, చివరికి అర్చకులపై దాడులు చేసి రాక్షసుల్లా ప్రవర్తించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల కూల్చివేత జరిగిందని, వాటిపై విచారణ జరిపించి అందరిని బొక్కలో వేస్తామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
తిరుమలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తామని శ్రీవెంకటేశ్వరస్వామి సాక్షిగా తాను మాట ఇస్తున్నానని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీతో సహ అన్ని ఆలయాల్లో బ్రాహ్మణులను ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తామని, ఆలయాల వార్షిక ఆదాయం బట్టి అర్చకులను రూ. 15 వేలు, రూ 10 వేలు, రూ 5 వేలు గౌరవ వేతేనం అందిస్తామని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
పుంగనూరులో జరిగిన బహిరంగ సభలో మాజీ సీఎం, రాజంపేట లోక్ సభ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీవీల్లో, సినిమా థియేటర్లలో ఒక ప్రకటన వచ్చేదని గుర్తు చేశారు. నిమిషం సుఖం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ ఓ ప్రకటన ద్వారా ఎయిడ్స్ వ్యాదిపై ప్రజలకు అవగాహన కల్పించేవారని, ఎయిడ్స్ కంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా ప్రమాదకరం అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications