46 సెగ్మెంట్లే కీలకం, గాలికి చెక్ పెడతారా, బాబు ప్లాన్ ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాలు ప్రాతినిథ్యం వహిస్తున్న 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకోవాలని టిడిపి ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆయా నియోజకవర్గాల్లో సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

2019 ఎన్నికలకు అధికార టిడిపి, విపక్ష వైసీపీ ఇప్పటినుండే ప్రణాళికలను సిద్దంచేస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఈ ఏడాది అక్టోబర్ నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

ఎన్నికల్లో అధికారాన్ని కట్టబెడితే ఏంచేస్తామనే విషయాన్ని కూడ ప్లీనరీ వేదికగా జగన్ ప్రకటించారు. 9 హమీలతో పాదయాత్రలో టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.

అయితే టిడిపి కూడ సంస్థాగతంగా మరింత బలపడేందుకు వ్యూహారచన చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలపై చంద్రబాబునాయుడు నివేదికలను తెప్పించుకొంటున్నారు.

ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు టిడిపి చీఫ్ ఇప్పటినుండే కసరత్తు చేస్తున్నారు.

 46 అసెంబ్లీ స్థానాలపై టిడిపి కేంద్రీకరణ

46 అసెంబ్లీ స్థానాలపై టిడిపి కేంద్రీకరణ

రాష్ట్రంలో వైసీపీకి చెందిన 46మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని బలోపేతం చేసేందుకు టిడిపి ప్లాన్ చేస్తోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే నాయకుల కోసం టిడిపి చూస్తోంది. ఈ అసెంబ్లీ స్థానాల్లో పాగా వేస్తే రానున్న ఎన్నికల్లో పార్టీకి మరిన్ని స్థానాలు పెరిగే అవకాశం ఉంటుందని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ప్రధానంగా విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితితో పాటు, టిడిపి నేతల పరిస్థితిపై బాబు నివేదికలను తెప్పించుకొంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టనున్నారు.

Ex CM To Join Pawan Kalyan's Jana Sena Party?
అవసరమైతే ప్రత్యామ్నాయాలు

అవసరమైతే ప్రత్యామ్నాయాలు


వైసీపీకి చెందిన 46 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి ఇంచార్జీలు వైసీపీ ఎమ్మెల్యేలను ఎదుర్కొంటారా, లేదా అనే నివేదికలపై చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటీ, టిడిపి ఇంచార్జీ పరిస్థితి ఎలా ఉంది, టిడిపి ఇంచార్జీ వైసీపీ ఎమ్మెల్యేను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనే పరిస్థితిలో ఉంటాడా, లేక ప్రత్యామ్నాయాలను చూసుకోవాలా అనే దిశగా కూడ టిడిపి నాయకత్వం ఆలోచన చేస్తోంది. రాయలసీమ జిల్లాల్లోని ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు. దీంతో రాయలసీమపైనే టిడిపి ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించింది.

గాలి వారసుడొస్తాడా

గాలి వారసుడొస్తాడా

చిత్తూరు జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టిడిపి కొంచెం ఇబ్బందికరపరిస్థితుల్లో ఉంది. మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీ లేరు. పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలకు ఇంచార్జీలు ఉన్నా ప్రత్యర్థులను ఢీకొట్టేస్థాయిలో లేరనే అభిప్రాయం కూడ లేకపోలేదు. గత ఎన్నికల్లో నగరి నుండి పోటీచేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు రోజా చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీచేస్తారా, ఆయన తనయుడిని రంగంలోకి దించుతారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 నాయకత్వం స్పష్టత ఇవ్వాలి.

నాయకత్వం స్పష్టత ఇవ్వాలి.

ప్రస్తుతం ఆయా సెగ్మెంట్లకు ఇంచార్జీలుగా ఉన్న వారికి స్పష్టత ఇస్తే వారి పనితీరులో మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదని కొందరు పార్టీ సీనియర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఇంచార్జీ మంత్రులకు బాధ్యతను అప్పగించి ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జిల్లా ఇంచార్జీ మంత్రులు, నియోజకవర్గ ముఖ్యులు చర్చించి ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని కొందరు సీనియర్లు సూచిస్తున్నారు.

గెలుపుకోసం ఇంచార్జీ పనిచేయాలి

గెలుపుకోసం ఇంచార్జీ పనిచేయాలి


ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని, అయితే విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాల్లో విజయం సాధించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించేలా ఇంచార్జీలు పనిచేయాలని లేకపోతే మార్పు తథ్యమని బాబు పార్టీ నాయకులకు స్పష్టం చేసినట్టు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp chief Chandrababu naidu concentrate on 46 assembly segments in Ap.Ysrcp Mla's represented from 46 assembly segments.Tdp leadership conducting survey in 46 segment, after survey report babu will take a decission.
Please Wait while comments are loading...