200 మంది శవాల్ని దాటుకొని వెళ్ళాం, ప్రాణాలతో వస్తామనుకోలేదు: రాణి

200 శవాల్ని దాటుకొని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జూనియర్ కాలేజీ విద్యార్థిని రాణి చెప్పారు. కాకినాడలో జరిగిన మహసంకల్ప దీక్షలో ఎవరెస్టు శిఖరం అధిరోహించడంలో తన

కాకినాడ: 200 శవాల్ని దాటుకొని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జూనియర్ కాలేజీ విద్యార్థిని రాణి చెప్పారు. కాకినాడలో జరిగిన మహసంకల్ప దీక్షలో ఎవరెస్టు శిఖరం అధిరోహించడంలో తన అనుభవాలను ఆమె పంచుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ఇటీవలనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఈ విద్యార్థులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు కాకినాడలో జరిగిన మహసంకల్పదీక్షలో ఘనంగా సన్మానించారు.

ఎవరెస్టు శిఖరం ఎక్కిన ఒక్కొక్క విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున బాబు అందజేశారు. వారిని వేదికపైకి పిలిచి అభినందించారు. ఎవరెస్టు శిఖరం ఎక్కిన విద్యార్థుల అనుభవాలను ఆయన తెలుసుకొన్నారు.ఎవరెస్టు శిఖరం ఎక్కకుండా అక్కడికి వెళ్ళిన విద్యార్థులకు ప్రభుత్వం రూ.5 లక్షలను ఇచ్చింది.

ఇంటర్ చదువుతున్న రాణి అనే విద్యార్థిని ఎవరెస్టు శిఖరం ఎక్కడంలో తాము ఎదుర్కొన్న కష్టనష్టాలను వివరించారు. ఎవరెస్టు శిఖరం ఎక్కలేక ప్రతికూల వాతావరణంలో ఆ శిఖరంపైనే వందలాది మంది చనిపోయి ఉన్నారని ఆమె గుర్తుచేశారు.

200 శవాలను దాటుకొంటూ వెళ్ళాం

200 శవాలను దాటుకొంటూ వెళ్ళాం

200 శవాలను దాటుకొని ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కామని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థి రాణి చెప్పారు.ఆ శవాలను చూసిన సమయంలో తాము తిరిగివస్తామనే నమ్మకం కూడ లేదన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని చెప్పారు.పెద్ద సాహసం చేయడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, టీచర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.ఎవరెస్టు గురించి పుస్తకాల్లో మాత్రమే తెలుసునని, కానీ, ఆ శిఖరాన్ని ఎక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారామె.

బేస్ క్యాంప్ కు వెళ్ళాక కష్టాలను ఎదుర్కొన్నాం

బేస్ క్యాంప్ కు వెళ్ళాక కష్టాలను ఎదుర్కొన్నాం

ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు వెళ్ళిన తర్వాత కష్టాలను ఎదుర్కొన్నట్టు రాణి చెప్పారు.కేతనకొండలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు శిక్షణ పొందినట్టు ఆమె గుర్తుచేసుకొన్నారు.ఏప్రిల్ 8వ, తేదిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు బయలుదేరినట్టు చెప్పారు. ఎవరెస్టు ఎక్కే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా పీలవుతున్నట్టు చెప్పారామె.

ప్రాణాలతో వస్తామో లేదో తెలియదు

ప్రాణాలతో వస్తామో లేదో తెలియదు

ఎవరెస్టు శిఖరం ఎక్కే సమయంలో అనేక అవాంతరాలు ఎదురైనట్టు ఆమె చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రాణాలతో తిరిగివస్తామో లేదో కూడ తెలియని పరిస్థితిలో ఉన్నామని ఆమె గుర్తుచేసుకొన్నారు. అయితే ఆ సమయంలో తన వాళ్ళంతా గుర్తుకు వచ్చారని చెప్పారు.ఉష్ణోగ్రతలు తక్కువ. అధికంగా గాలులు రావడంతో చాలా ఇబ్బందులను పడినట్టు ఆమె చెప్పారు.

త్రివర్ణ పతాకం ఎగురేసి మురిసిపోయాం

త్రివర్ణ పతాకం ఎగురేసి మురిసిపోయాం

ఎవరెస్టుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సంతోషపడినట్టు ఆమె చెప్పారు.భయపడితే తాము ఎవరెస్టును అధిరోహించకపోయేవారమన్నారు. అంతేకాదు ప్రభుత్వం కూడ తమపై ఖర్చుచేసిందన్నారు.అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి త్రివర్ణ పతాకం ఎగురవేయడంతో తాము అనుభవించిన కష్టాలన్నీ తీరిపోయాయన్నారామె.ఎవరెస్టు శిఖరం ఎక్కాలనే ధైర్యం ఉండాలని ఆమె సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+