Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్రిటిష్, నిజాం.. మోడీపై పోరాటం, పవన్! ఏం చేస్తున్నావ్: బాబు సంచలనం, డైరెక్ట్ వార్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రధాని నరేంద్ర మోడీపై డైరెక్ట్ వార్‌కు దిగారు. ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలపై నిలదీస్తే బీజేపీ ఎదురు దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు.

చదవండి: పవన్ వస్తే కారు వరకు, తీరు మార్చుకోమని చంద్రబాబుకు చెప్పాల్సింది: మురళీమోహన్

నాడు బ్రిటిష్ వారి పైన పోరాటం చేశామని, నిజాంపై పోరాటం చేశాని, ఇప్పుడు మోడీపై పోరాటం చేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు. గత కొంతకాలంగా చంద్రబాబు కేంద్రం అన్యాయం చేసిందంటూ ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు మోడీ నిధులు ఇస్తున్నారని, సహకరిస్తున్నారని చెప్పిన చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

చదవండి: జనసేన బలోపేతంపై 5గం.ల చర్చ, జేపీ విమర్శలపై పవన్ కళ్యాణ్ స్పందన

నేరుగా మోడీని అటాక్ చేశారు

నేరుగా మోడీని అటాక్ చేశారు

చంద్రబాబు మాత్రం కేంద్రంపై విమర్శలు కొనసాగిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు ఆయన నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కూడా నేరుగా మోడీని అటాక్ చేశారు. మాటల తూటాలు విసిరారు. బ్రిటిష్, నిజాం వారిపై పోరాడామని, అలాగే ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.

మోడీపై తిరుగుబాటు చేయాలి

మోడీపై తిరుగుబాటు చేయాలి

కేంద్రంపై మనం చేసేది ధర్మపోరాటం అని చంద్రబాబు అన్నారు. అన్యాయాన్ని సరిదిద్దుకోవాలని కేంద్రానికి చెబితే లెక్కలేనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీపై తిరుగుబాటు చేయాలన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులకు న్యాయం చేయాలని తాను అడుగుతున్నానని చెప్పారు.

నాపై ఢిల్లీ వారికి కోపం ఉన్నా వదిలిపెట్టను

నాపై ఢిల్లీ వారికి కోపం ఉన్నా వదిలిపెట్టను

తాను పుట్టిన గడ్డ కోసం పోరాటం చేస్తున్నానని, జన్మభూమి కోసం పోరాడుతున్నానని చంద్రబాబు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేసుల మాఫీ కోసం కేంద్రానికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఢిల్లీ పెద్దలకు తనపై కోపం ఉన్నప్పటికీ ఏపీకి సాయం చేసే వరకు తాను వదలి పెట్టేది లేదన్నారు.

నాకు అండగా ఉండాలి.. పవన్ కళ్యాణ్‌కు చురకలు

నాకు అండగా ఉండాలి.. పవన్ కళ్యాణ్‌కు చురకలు

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు చురకలు అంటించారు. జన్మభూమిపై అభిమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా రాష్ట్రం తరఫున నిలబడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రం తరఫున పోరాడుతున్నాను కాబట్టి తనకు అండగా ఉండాలన్నారు.

హడావుడి చేసి ఇప్పుడేం చేస్తున్నావ్

హడావుడి చేసి ఇప్పుడేం చేస్తున్నావ్

కేంద్రం హామీలు నిలబెట్టుకోకున్నా జన్మభూమిపై అభిమానం ఉన్నవారు ఎందుకు ఉపేక్షిస్తున్నారని పవన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ హడావుడి చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇదిలా ఉండగా, ఆయన అనంతపురం జిల్లా లేపాక్షిలో లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+