ఓటుకు నోటు: 'నిలదీస్తారనే భయంతోనే చివరిరోజు చంద్రబాబు డుమ్మా'
హైదరాబాద్: ఓటుకు నోటు అంశంపై అసెంబ్లీలో నిలదీస్తారనే అసెంబ్లీ చివరి రోజు సమావేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డుమ్మా కొట్టారని వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య (నందికొట్కూరు నియోజకవర్గం) ఆరోపించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు అంశంపై వైసీపీ చర్చించడానికి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించగా, తనను నిలదీస్తారేమోనన్న భయంతోనే చివరిరోజు అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు నాయుడు రాలేదన్నారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యసలపై చర్చించకుండా ప్రతిపక్షం గొంతు నొక్కేశారని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కే మైక్ ఇవ్వలేదని ఆరోపించారు.

చీటింగ్ కేసులు అందుకే: మాజీ మంత్రి శైలజానాథ్
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా అధికార టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై టీడీపీ, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులపై చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాయని మండిపడ్డారు. దీనివల్లే ప్రజలు అందోళన చెందుతున్నారన్నారు.
జీజీహెచ్ అభివృద్ధి కమిటీ: ఆంజనేయులు
ఏఎన్‌యూను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే జీజీహెచ్ అభివృద్ధి కమిటీని నియమించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని భీమ్‌రావువాడలో ఉన్న నిరుపేదల ఇళ్లు కూల్చివేసి గాంధీభవన్ నిర్మించిన విషయాన్ని జగన్ మరిచిపోకూడదని ఆయన గుర్తుచేశారు. దిక్కుతోచని స్థితిలోనే వైసీపీ నేతలు టీడీపీపై అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని ఆంజనేయులు విమర్శించారు.












Click it and Unblock the Notifications