మా పరువు పోతోంది: ‘సోమ’పై చంద్రబాబు ఆగ్రహం, ‘ఎన్నికలు ఏకపక్షమే’

అమరావతి: ఆర్ అండ్ బీ సమీక్షా సమావేశంలో సోమ కంపెనీపై, ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో జన్మభూమి కమిటీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. జన్మభూమి కమిటీల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే సహించబోనని ఆయన స్పష్టంచేశారు.

మంగళవారం అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జన్మభూమి కమిటీలోని సభ్యులు తప్పుచేస్తే వెంటనే ఆ వారిని తప్పించాలని సీఎం ఆదేశించారు.

ఎన్నికలు ఏకపక్షమే

ఎన్నికలు ఏకపక్షమే

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించిన విధంగానే దళిత తేజం కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. దళిత తేజం కార్యక్రమం ఎలా జరుగుతుందో నిత్యం తాను పర్యవేక్షణ చేస్తాన్నారు. దళిత తేజం విజయవంతం ద్వారా 2019 ఎన్నికలు ఏకపక్షం కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

కంచుకోట కావాలి

కంచుకోట కావాలి

ప్రభుత్వంపై సానుకూలత ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ పట్ల సానుకూలతగా దానిని మార్చుకోవాలని సూచించారు. ప్రతి ఊరు పార్టీకి కంచుకోట కావాలని, గ్రామం అభివృద్ది చెందాలని, పార్టీ అభివృద్ది చెందాలని సీఎం తెలిపారు.

సహించను

సహించను

నెలకు నాలుగైదు రోజులు జిల్లా ఇంఛార్జి మంత్రులు పార్లమెంట్ స్థానంపై దృష్టిసారించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో 80% సంతృప్తి కల్గించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. క్రమశిక్షణకు భంగం కలిగిస్తే సహించనని చంద్రబాబు తేల్చి చెప్పారు.

 ప్రభుత్వం పరువు పోతోంది

ప్రభుత్వం పరువు పోతోంది

ఇది ఇలా వుంటే, ఆర్ అండ్ బీ సమీక్షా సమావేశంలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం పనుల జాప్యంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. సోమ చేతగానితనం, అసమర్థతో ప్రభుత్వం పరువు పోతోందని మండిపడ్డారు. మార్చి వరకు రహదారులపై రాకపోకలు ప్రారంభించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో రేపట్నుంచే పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలో ఉండాలని చెప్పారు. ఓఆర్ఆర్ నిర్మాణంపై సమీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+