పెద్దిరెడ్డిని గురిచూసి కొట్టిన చంద్రబాబు, కుప్పం దెబ్బకు ప్రతీకారం, మొదటికే మోసం వస్తే !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్షంగా అన్ని పార్టీలు పని చేస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో చేసిన తప్పు మరోసారి చెయ్యకూడదని తెలుగుదేశం, జనసేన పార్టీలు పక్కాప్లాన్ చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విధంగా కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రత్యేక శ్రద్ద పెట్టారు. రాజకీయ శత్రువు అయిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చుక్కలు చూపించాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారని తెలిసింది. కుప్పం మునిసిపాలిటీ తెలుగుదేశం నుంచి చేజారిపోవడానికి పెద్దిరెడ్డి కారణం అని రగిలిపోతున్న చంద్రబాబు నాయుడు అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

రాజంపేట లోక్ సభ నియోజక వర్గం పరిధిలోకి పుంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, రాజంపేట, రాయచోటీ నియోజక వర్గాలు వస్తాయి. గత లోక్ సభ ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా వైసీపీ టిక్కెట్ తో పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజక వర్గాల్లో చంద్రబాబు నాయుడికి మంచి పట్టు ఉంది
అయితే పుంగనూరులో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఓడించడం అంతసులభం కాదని టీడీపీ నాయకులకు తెలుసు. ఇదే సమయంలో తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డికి చెక్ పెట్టడానికి అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జయచంద్రా రెడ్డికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చింది. పుంగనూరులో చల్లా రామచంద్రా రెడ్డికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చింది. రాజంపేట లోక్ సభ నియోజక వర్గంలో మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో వాటిపైన వైసీపీ, టీడీపీ ఫోకస్ పెట్టాయి
.
గత నెలలోనే మదనపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాను పక్కన పెట్టిన వైసీపీ తరువాత నిషార్ అహమ్మద్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. మైనారీ ఓట్లు ఎక్కువగా ఉన్న మదనపల్లె టిక్కెట్ కోసం తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ, జనసేన పార్టీ నుంచి పార్టీ రాయలసీమ కో ఆర్డినేటర్ గంగారపు రాందాస్ చౌదరి పోటీపడ్డారు. అయితే రాజంపేటలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు మదనపల్లెలో వైసీపీని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి సన్నిహితుడి కుటుంబంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఇటీవల టీడీపీలో చేరిన షాజహాన్ బాషాకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చింది. మదనపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు నవాజ్ బాషాకు సొంత అన్న ఈ షాజహాన్ బాష, సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు వైసీపీ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు అదే సిట్టింగ్ ఎమ్మెల్యే సొంత అన్న షాజహాన్ బాషాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు వైసీపీని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, మదనపల్లెలో వైసీపీ మైనారిటీ అభ్యర్థిని దెబ్బ తియ్యడానికి, మైనార్టీ ఓట్లు చీలిపోవడానికి చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు, మదనపల్లెలో మైనారిటీ ఓట్ల మీద కోటి ఆశలు పెట్టుకున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశల మీద చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లారు. మదనపల్లెలో ఎన్నడూ లేని విధంగా రెండు ప్రధాన పార్టీలు మైనార్టీలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంతో అక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అయితే మదనపల్లెలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముందు నుంచి వేసుకున్న అంచనాలు తల్లకిందులు అవుతున్నాయని తెలిసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications