సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: వారానికో గంట అంటూ చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తక్కువ సమయంలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసిన చంద్రబాబు ప్రభుత్వం దేశంలోనే నదులను అనుసంధానం చేసిన తొలి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించింది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన చంద్రబాబు, ఇక జాతీయ ప్రాజెక్టు పోలవరంపై దృష్టి సారించారు.

ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారంలో ఓ గంట పోలవరం ప్రాజెక్టు వద్దే తిష్ట వేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారిస్తానని ప్రకటించారు.

2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, నిర్మాణ పనుల వేగాన్ని పెంచాలంటూ అధికార యంత్రాంగానికి డెడ్ లైన్ విధించారు. అంతేకాదు నిర్మాణ పురోగతిని ప్రతి రోజూ డ్యాష్ బోర్డు ద్వారా సమీక్ష జరుపుతానని ఆయన చెప్పారు. 2018 ఏప్రిల్‌ 27నాటికి కాంక్రీట్‌ పనులు పూర్తి కావాలని ఆదేశించారు.

సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

ఇక పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకం, సంక్లిష్టమయిన కాంక్రీట్‌ నిర్మాణాలను చేపట్టేందుకు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన ‘ఫ్యుజీమీస్టర్‌' ముందుకువచ్చింది. ఎర్త్‌‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ వంటి పనుల నిర్వహణలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది.

 సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

ఈజిప్టులోని ప్రఖ్యాత పనామా కాలువ నిర్మాణంలో కూడా ఫ్యుజీమీస్టర్‌ భాగస్వామ్యం వహించింది. ఇలాంటి సంస్థలు ముందుకు వస్తేనే పనులు సకాలంలో పూర్తి అవుతాయని చంద్రబాబు వివరించారు. ఈ సమావేశంలో సంస్ధ ప్రతినిధులు ట్రాన్స్‌స్ర్టాయ్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాంబశివరావుతో కలిసి పాల్గొన్నారు.

సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

పెద్ద సంస్థలైనప్పటికీ నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాల్సిందేనని, జాప్యాన్ని సహించనని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ట్రాన్స్‌సాట్రయ్‌ -ఫ్యుజీమీస్టర్‌లతో అవగాహనా ఒప్పందాలపై జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సమీక్షించాలని ఆదేశిచారు.

 సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు అవి సిద్ధమైనందున.. పదహారన్నర నెలల్లో ఎలాంటి అవాంతరాలూ లేకుండా ఎప్పటికప్పుడు పనులు సమీక్షించండని కాంట్రాక్టు సంస్థలు, జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పనుల వేగవంతం కోసం కాంట్రాక్టు సంస్థలకు అవసరమైన మేరకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులను నిబంధనల మేరకు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

 సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

కాగా, గోదావరి నీటిని గ్రావిటీ లేదా చిన్న తరహా ఎత్తిపోతల పథకాల సాయంతో పెన్నా నదితో అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దానికోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకూ 37 వేల పంటకుంటలే పూర్తి కావడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

సాకులొద్దు.. సమస్యలుంటే నాతో చెప్పండి: చంద్రబాబు

నాలుగేళ్లపాటు వర్షాలు కురవకపోయినా కరువును జయించేలా సమర్థ జలయాజమాన్య నిర్వహణతో కార్యాచరణను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాభావం ఉన్న 180 మండలాల్లో పంటలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu naidu held meeting with irrigation officials in cm camp office at Vijayawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X