కుప్పంలో ‘లక్ష ఓట్లు లక్షం’గా పెట్టుకున్న లీడర్స్, తేడా రాకూడదని పక్కాప్లాన్, మ్యాటర్ !
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరోసారి చక్రం తిప్పాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశపడుతున్నారు. చంద్రబాబు నాయుడిని ఎలాగైనా ఓడించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పం అంటే చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడు అంటే కుప్పం అన్నంతగా ఆయన తెలుగు ప్రజల్లో చెరగని ముద్రవేశారు.
40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కుప్పంతో చంద్రబాబు నాయుడికి అనుబంధం విడదీయరానిది. 1983లో తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్ధి చేతుల్లో ఓటమి పాలయ్యారు. అయితే 1989 నాటికి తెలుగుదేశంలో చేరిన ఆయన ఆనాటి ఎన్నికల్లో చంద్రగిరి నుంచి కుప్పంకు మకాం మార్చారు. నాటి నుంచి నేటి వరకు కప్పం నియోజక వర్గాన్ని తనకు కేరాఫ్‌గా అడ్రస్ గా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస గెలుపులతో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడికి తప్పా మరెవ్వరికి ఓటు వేయడం లేదు. పెద్దగా ప్రచారం చేయకపోయినా కుటుంబ సభ్యులే ఆయన తరపున నామినేషన్ వేసినా చంద్రబాబు నాయుడిని కుప్పం ప్రజలు ఆదరిస్తూనే వస్తున్నారు. అయితే జగన్ సీఎం అయిన తరువాత కుప్పంలో సీన్ మారిపోతూ వస్తోంది.
కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటకకు అత్యంత సమీపంలో వుంటుంది. కుప్పంలో దాదాపుగా అందరూ తెలుగు, తమిళ, కన్నడ భాషలు మాట్లాడేవాళ్లు ఉన్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఈ మూడు బాషలు మాట్లాడేవాళ్లు కనపడుతుంటారు. కుప్పం నియోజక వర్గంలో కమ్మ , రెడ్డి, శెట్టిబలిజ, మైనారిటీ, దళితుల ప్రాబల్యం ఎక్కువ. 1955లో ఏర్పడిన కుప్పం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,306 మంది. కుప్పంలో పురుషులు 1,11,428 మంది. మహిళలు 1,11,860 మంది. కుప్పం సెగ్మెంట్ పరిధిలో కుప్పం మున్సిపాలిటీ, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలు ఉన్నాయి.
కుప్పం నియోజవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి. 1983లో కుప్పంలో మొదలైన టీడీపీ శకం ఆ రోజు నుంచి నేటి వరకు కొనసాగుతోంది. 1983, 1985లలో టీడీపీ తరపున రంగస్వామి నాయుడు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 1989లో నారా చంద్రబాబు నాయుడు ఎంట్రీ తర్వాత నుంచి కుప్పం ఆయనకు అడ్డాగా మారింది. కుప్పంలో వరుసగా 7 సార్లు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకబడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో టీడీపీ మద్ధతుదారులు ఓటమి పాలవ్వడంతో తెలుగుదేశం హైకమాండ్ ఉలిక్కిపడింది. చివరికి కుప్పం మునిసిపాలిటి ఏర్పడం, మొదటిసారి జరిగిన మునిసిపాటిలి ఎన్నికల్లో వైసీపీ జెండాలు ఎగరడంతో చంద్రబాబు నాయకుడు ఉలిక్కిపడ్డారు. ఈ దెబ్బతో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జాగ్రత్తపడ్డారు.

ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి తరచుగా వెళ్తున్నారు. మొన్నటికి మొన్న ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారు. 2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గడంతో జగన్ కుప్పం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. నారా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా చిరకాల ప్రత్యర్ధిగా వున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
గతంలో నారా చంద్రబాబు నాయుడిపై పోటీ చేసి ఓటమిపాలైన భరత్‌ను జగన్ వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. భరత్ ఎమ్మెల్సీగా, కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రోత్సహించడంతో పాటు వైసీపీ ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు సైతం కుప్పం విషయంలో అలర్ట్ అయ్యారు. వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలకు చెక్ పెట్టాలని పావులు కదుపుతున్నారు.
లక్ష ఓట్ల మెజారిటీ టార్గెట్ పెట్టిన నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం టీడీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు నాయుడు వ్యూహాలను ఆయన శ్రీకాంత్ పక్కాగా అమలు చేస్తున్నారు. కుప్పం నియోజక వర్గంలో ఎక్కడ టీడీపీ వీక్‌గా అవుతుందో అక్కడ టీడీపీ పుంజుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. లక్షే లక్ష్యం అన్న నినాదంతో టీడీపీ ప్రచారం ప్రారంభించింది. కుప్పం పట్టణంలో చంద్రబాబు నాయుడు సొంతింటి నిర్మాణం కూడా వేగవంతం చేశారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications