ఏం చేశాం: కేసీఆర్, తీగలపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన, పార్టీని వీడిన నేతల పైన దుమ్మెత్తి పోశారు. స్వార్థపరులే పార్టీని వీడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ దూసుకుపోతుందన్నారు. తాను ఎక్కడకు వెళ్లనని, తెలంగాణలో అధికారంలోకి వచ్చే వరకు ఇక్కడే ఉంటానని తెలిపారు.
స్వార్థపరులైన నాయకులు పార్టీని వీడుతున్నా కార్యకర్తలు మాత్రం నిజాయతీగా పార్టీ కోసం పని చేస్తున్నారన్నారు. ఇటీవలే తెరాసలో చేరిన తీగల కృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పార్టీ ఇవ్వని పదవి ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలసిమెలసి ఉండటమే తనకు ముఖ్యమన్నారు.

చంద్రబాబు
ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించారని, మీ చేతిలో అధికారం ఉందని, సమస్యలు వస్తే వాటిని పరిష్కరించే మార్గాలు అన్వేషించాలని, అది వదిలిపెట్టి పక్కవారిపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూడటం ఏమిటని తెలంగాణలో తెరాస ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కూ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, నేను కేంద్రంపైనో పక్క రాష్ట్రాల పైననో నెపం నెట్టి తప్పించుకోవాలని చూడటం లేదని, వాటిని అధిగమించాలని ప్రయత్నిస్తున్నామని, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి ఆర్థికంగా భారీ లోటు ఉంటుందని తెలంగాణకు కరెంటు కొరత ఉంటుందని తాను అనేకసార్లు చెప్పానని అన్నారు.

చంద్రబాబు
వచ్చిన ప్రభుత్వాలు దానికి తగినట్లుగా ముందు చూపుతో వెళ్లాలని, పోయినసారి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణలో తీవ్రమైన కరెంటు కొరత ఉండేదని, తాను ఒక సవాల్‌గా తీసుకొని 2004 నాటికి మిగులు కరెంటు తెచ్చానని, తెలంగాణలో కరెంటు సరఫరాను బాగు చేశానన్నారు.

చంద్రబాబు
ఎవరికైనా దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. మొన్న తుఫాన్‌లో ఉత్తరాంధ్రలో 30 వేల విద్యుత్ స్తంభాలు, ఐదు వేల ట్రాన్స్‌ఫార్మర్లు, వేల చెట్లు పడిపోయాయని, రెండు మూడు నెలల వరకూ కరెంటు రాదని అందరూ అనుకొన్నారని,
వారం రోజుల్లో కరెంటు తెచ్చి చూపించానని, అది మా తడాఖా అన్నారు.

చంద్రబాబు
నలుగురు నాయకులను తీసుకెళ్ళి టీడీపీని బలహీనపర్చగలమని కొందరు కలలు కంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని బలహీనపర్చే శక్తి ఈ ప్రపంచంలోనే లేదని ఆయన అన్నారు.

చంద్రబాబు
ఇందిరాగాంధీ, వైఎస్, సోనియా గాంధీ వంటివారంతా టీడీపీని ఏదో చేయగలమని భ్రమపడ్డారని, ఏమీ కాలేదని, ఒకరు పోతే వందమందిని తయారు చేసుకొనే శక్తి టీడీపీకి ఉందన్నారు.

చంద్రబాబు
పాలన చేయడం చేతగాక మన నాయకుల వెంటబడి తీసుకువెళ్ళి మన పార్టీని బలహీనపర్చాలని చూస్తున్నారని, ఒకరిద్దరిని తీసుకువెళ్ళి నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, రెచ్చగొడితే రెచ్చిపోతానని, బుల్లెట్‌లా దూసుకువెళ్తానని, అంకిత భావంతో ఉన్న పార్టీ కార్యకర్తలే నా బలమన్నారు.

చంద్రబాబు
వాళ్ళకు నేను.. నాకు వాళ్ళు చాలన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీని గెలిపించే నేను బయటకు వెళ్తానని, కాంగ్రెస్ పార్టీ ఇక అడ్రస్ ఉండదన్నారు.

చంద్రబాబు
తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల మనదే బలమని, వచ్చేది మనమని, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు. తెలంగాణను అభివృద్ధి చేసిన తాను తెలంగాణ ద్రోహి అవుతానా అని ప్రశ్నించారు.

చంద్రబాబు
ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో హైస్కూళ్ళు సరిగ్గా లేవని, అలాంటి జిల్లాలో 220 ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చేలా చేశానని, నేను హైదరాబాద్ అభివృద్ధి కోసం చేసిన కృషితో రంగారెడ్డి జిల్లా ఊహించనంత అభివృద్ధి అయిందన్నారు.

చంద్రబాబు
తెలంగాణలో విద్యా వైద్య సౌకర్యాలు, ప్రాజెక్టులు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు అభివృద్ధి చేసింది ముందు ఎన్టీఆర్ తర్వాత తానే అన్నారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని నేను అనేకసార్లు పిలుపు ఇచ్చినా ముందుకు వచ్చిన వాళ్లు లేరన్నారు.

చంద్రబాబు
తనను ఎన్నుకొన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు పరిష్కరించి అక్కడి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఆ పని చేస్తూనే తెలంగాణ ప్రజల అవసరాలు కేంద్రం దృష్టికి నేను తీసుకు వెళ్తున్నానన్నారు.
2019 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇటీవల తెరాసలోకి వెళ్లిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని తెరాస నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.
తెలంగాణ ప్రజలు తెరాసను నమ్మి గెలిపించారని, చేతిలో అధికారం ఉంచుకుని కూడా సమస్యల పరిష్కారానికి మార్గాలు చూడకుండా తనపై నెపం నెడుతూ తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో ఇబ్బందులు వచ్చాయని, దానికి కేంద్రాన్నో, పక్క రాష్ట్రాల్నో నిందించే ప్రయత్నం తాను చేయలేదన్నారు.
ఏపీకు ఉన్న అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నానన్నారు. రాష్ట్ర విజభన జరిగిన తర్వాత ఏపీకు ఆర్థిక లోటు, తెలంగాణకు కరెంట్ కష్టాలు ఉంటాయని తాను ముందు నుంచి చెబుతూ వస్తున్నామన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ముందుచూపుతో వెళ్లాలని, ముఖ్యమంత్రిగా ఏపీలో తాను అదే చేస్తున్నానన్నారు.
తాను గతంలో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి, తెలంగాణలో తీవ్రమైన విద్యుత్ సమస్య ఉండేదని, దానిని సవాల్‌గా తీసుకుని 2004 నాటికి తెలంగాణలో మిగులు కరెంట్ తెచ్చానన్నారు. హుధుద్ తుపానుకు ఉత్తరాంధ్రలో 30 వేల విద్యుత్ స్తంభాలు, ఐదు వేల ట్రాన్స్ ఫార్మర్లు, కొన్ని వేల చెట్లు పడిపోయాయన్నారు. రెండు, మూడు నెలల వరకు కరెంట్ సరఫరా అసాధ్యమని అధికారులు అంటే, తాను దానిని సవాల్‌గా తీసుకుని వారం రోజుల్లో కరెంట్ తెచ్చి చూపించానన్నారు.












Click it and Unblock the Notifications