వదిలిపెట్టం: అగ్రిగోల్డ్‌పై బాబు, బాధితులకు ఎక్స్ గ్రేషియా, నిందితుల ఆచూకీ చెప్తే బహుమానం

Subscribe to Oneindia Telugu

అమరావతి: రాష్ట్రంలో వైట్ కాలర్ మోసాలు జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబునాయుడు అగ్రిగోల్డ్‌పై ప్రకటన చేశారు. అగ్రిగోల్డ్ పై పది కేసులు నమోదయ్యాయని చెప్పారు. వివిధ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు.

మొత్తం 19మంది నిందితులున్నారని చంద్రబాబు తెలిపారు. అంతేగాక, 19లక్షల డిపాజిటర్లున్నారని చెప్పారు. రూ. 6,380కోట్లు వసూలు చేశారని తెలిపారు. అగ్రిగోల్డ్ కేసును 2015 జనవరి 5న సీబీసీఐడీకీ అప్పగించామని చెప్పారు. రాష్ట్రం నుంచే రూ.4వేల కోట్ల పెట్టుబడి పెట్టారని తెలిపారు.

chandrababu naidu on Agri Gold case in Assembly

కోర్టు ఆదేశాల ప్రకారమే సీబీసీఐడీ విచారణ జరుపుతోందని చంద్రబాబు వివరించారు. 2014లో అగ్రిగోల్డ్ పై తొలి కేసు నమోదైందని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పారు.

బాధితులకు ఎక్స్ గ్రేషియా

అగ్రిగోల్డ్ కేసులో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు చెప్పారు. అంతేగాక, నిందితుల సమాచారం ఇస్తే రూ. 10లక్షల బహుమానం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం నుంచి తమకు కేసులు బదిలీ అయ్యాయని తెలిపారు. ఇలాంటివి 205కేసులుంటాయని చెప్పారు.

ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్న కేసు ఇదని చంద్రబాబు అన్నారు. రూ.2900కోట్ల మోసం చేశారని అన్నారు. వైట్ కాలర్ నేరాలను అరికట్టేందుకు కొత్త ఆర్థిక చట్టం చేసేందుకు కూడా సిద్ధమని చెప్పారు. బాధితులు కోరితే సీబీఐకి కూడా అప్పగించేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారని తెలిపారు.
మోసాలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu responded on Agri Gold case in Assembly on Thursday.
Please Wait while comments are loading...