గెలుపుపై చంద్రబాబు, పవన్‌కు థ్యాంక్స్: టిపైనా స్పందన
హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం పైన ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం స్పందించారు. తమది ప్రజా విజయం అన్నారు. దేశంలో, సీమాంధ్రలో, తెలంగాణలో జరిగిన ఫళితాలను చూస్తే ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారని అర్థమయిందన్నారు. ప్రజలు కుట్రపూరిత రాజకీయాలను, అవినీతి రాజకీయాలను తిప్పి కొట్టారన్నారు. కాంగ్రెస్ అసమర్థ నాయకత్వం వల్ల దేశం ఇప్పటికే నాశనమయిందన్నారు.
ఎన్డీయేకు దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైన ఊపు వచ్చిందన్నారు. కాంగ్రెస్ అవినీతి వల్ల ప్రజలు నష్టపోయారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రాన్ని విభజించిన తీరు చాలా బాధాకరమన్నారు. టిడిపిని దెబ్బతీయాలని విభజన కుట్ర పన్నారని, ఎవరు కుట్ర పన్నారో వారే ఆ గోతిలో పడ్డారన్నారు. సీమాంధ్రలో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. తెలంగాణలోను కాంగ్రెసు పార్టీ కంటే ప్రజలు తమ పైనే నమ్మకం పెట్టుకున్నారన్నారు.

తమ వల్లనే అభివృద్ధి, సంక్షేమం జరిగిందని తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు నమ్మారన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పుడు నీతివంతమైన పాలన ఇవ్వాల్సి ఉందన్నారు. తమ నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పారు. భారత దేశాన్ని ప్రపంచపటంలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు మోడీ సమర్థులు అన్నారు. సీమాంధ్రలో పునాదుల నుండి అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. సీమాంధ్రలోనే తాను ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు.
సీమాంధ్రులకు ఏం చేయాలో అది చేస్తామన్నారు. సీమాంధ్రలో పునాదుల నుండి అభివృద్ధఇ కావాల్సి ఉందని, చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. అభద్రతా భావంతో ఉన్న సీమాంధ్ర ప్రజలకు మోడీ విశ్వాసం కల్పించారన్నారు. తెలంగాణలోను ప్రజలు టిడిపిని మర్చిపోలేదన్నారు. సామాజిక తెలంగాణ కోసం తాము ఉద్యమించామన్నారు. హైదరాబాదులో సంచలనం సృష్టించామన్నారు.
హైదరాబాదులో మిగిలు బడ్జెట్‌కు టిడిపి పాలననే కారణమన్నారు. తెలంగాణలో తాము చేసిన అభివృద్ధే తమను నిలబెడుతుందన్నారు. సామాజిక తెలంగాణ, నవ తెలంగాణ కావాలన్నారు. సుపరిపాలన, అభివృద్ధి కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమతో కలిసి వచ్చారన్నారు.
తాను మోడీకి, పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపానన్నారు. కాంగ్రెసు వ్యతిరేక ఓట్లు చీలవద్దనే పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదని, అది కలిసి వచ్చిందన్నారు. టిడిపి ఓ యుగపురుడు స్థాపించిన పార్టీ అన్నారు. ఎన్డీయేకు 300కు పైగా సీట్లు వస్తాయని తొలుత చెప్పింది తానే అన్నారు. 330 లేదా 320 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఇది చాలా శుభపరిణామం అన్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications