పవన్ కళ్యాణ్‌పై కూల్‌గా పావులు కదుపుతున్న బాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!
Recommended Video

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఎమీ అనకుండానే ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? అందులో భాగంగానే అదే సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి, వచ్చే ఎన్నికల్లో విస్తృతంగా ఉపయోగించుకోనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

జనసేనానిని ఆహ్వానించిన చంద్రబాబు
2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. టీడీపీ గెలుపులో పవన్ కళ్యాణ్ పాత్రను కూడా తెలుగు తమ్ముళ్లు పదేపదే ప్రశంసించారు. బీజేపీ, వైసీపీలు కూడా పవన్ కారణంగా కూడా టీడీపీ విజయం సాధించిందని చెబుతున్నారు. అయితే, గత ఏడాది కాలంగా టీడీపీ, జనసేన మధ్య దూరం పెరిగింది. ఏపీలోని పలు అంశాలు, అవినీతిపై జనసేనాని నిలదీస్తున్నారు. దీంతో దూరం పెరిగింది. కానీ ఇటీవల మళ్లీ జనసేనానిని తమతో చేతులు కలపాలని స్వయంగా చంద్రబాబు ఆహ్వానించారు. దానికి పవన్ నో చెప్పడం వేరే విషయం.

పవన్ కళ్యాణ్ స్థానంలో కేసీఆర్
మొత్తానికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కలిస్తే టీడీపీకి లాభం అని చంద్రబాబు, టీడీపీ నేతలు భావించారు. అందుకే ఆయన తమతో కలిసి రాకపోయినప్పటికీ.. ఆయనను టార్గెట్ చేసుకోవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవల టీడీపీ.. పవన్‌ను టార్గెట్ చేయడం లేదు. ఆ స్థానంలో కేసీఆర్‌ను తెరపైకి తెచ్చారు. జగన్‌కు అండగా ఉంటున్నారంటూ తెలంగాణ సీఎంపై విమర్శలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌పై కూల్‌గా పావులు కదుపుతున్న చంద్రబాబు
అయితే, పవన్ కళ్యాణ్‌ను ఏమీ అనవద్దని ప్రస్తుతానికి చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించినప్పటికీ, తమతో కలిసి రాని జనసేనానికి చెక్ పెట్టేందుకు కూల్‌గా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అందులో భాగంగానే వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి తీసుకువస్తున్నారని చెబుతున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మరిన్ని ఆఫర్లు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

పవన్ కళ్యాణ్‌కు చెక్ చెప్పేందుకేనా?
పవన్ కళ్యాణ్ కాపు నేత. కానీ ఆయన కుల రాజకీయాలకు తాను దూరం అని చెబుతారు. అదే సమయంలో వంగవీటి రాధాకృష్ణ కూడా కాపు నేత. కాపునేతగా వంగవీటి రంగా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో పవన్‌తో కూల్‌గా వెళ్తూనే... ఆయనకు వచ్చే ఎన్నికల్లో చెక్ చెప్పేందుకు వంగవీటి రాధాను తెరపైకి తెచ్చారని అంటున్నారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గం బాగా ఉన్నచోట.. జనసేనానికి చెక్ చెప్పేందుకు వంగవీటి రాధాను ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకోనున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications