అలాంటి ప్రధాని మీరొక్కరే.. మోడీని ఆకాశానికెత్తేసిన చంద్రబాబు

విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచం మెచ్చిన ఏకైక నాయకుడు ప్రధాని మోడీ అంటూ కొనియాడారు. బుధవారం ఏపీలో రూ. 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోపాటు చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

విశాఖపట్నంలో మోడీ రోడ్ షో అదిరిందన్నారు చంద్రబాబు. ఎక్కడికి పోయినా మోడీపై విశ్వాసం, నమ్మకం ప్రజలకు కలుగుతోందని అన్నారు. రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులు ఏకకాలంలో ప్రారంభం కావడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. విశాఖ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్ కల నెరవేరిందన్నారు. ఇకపై విజయాలే తప్ప అపజయాలు ఉండవన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించిందని తెలిపారు.

Chandrababu Naidu praises PM Modi at Visakhapatnam public meeting

భవిష్యత్తులోనూ ఈ కాంబినేషన్ కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో మోడీ ప్రధానిగా ఉంటారన్నారు. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుందని జోస్యం చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోడీ కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన మోడీ నినాదాలని చంద్రబాబు వివరించారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మేకిన్ ఇండియా తెచ్చారన్నారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, గతిశక్తి తీసుకొచ్చారని చెప్పారు. దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబై ఎలా ఉందో.. ఏపీకి విశాఖపట్నం ఆర్థిక నగరమని అన్నారు.

ప్రధాని మోడీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు. త్వరలో అమరావతికి రావాలని ప్రధానిని కోరుతున్నట్లు చెప్పారు. మీరు పునాది వేసిన అమరావతి నగరం ఎన్డీఏ హయాంలోనే కలల నగరంగా రూపు దిద్దుకోనుందని చంద్రబాబు చెప్పారు. మోడీ కార్యక్రమాల వల్ల దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానంలో ఉంటామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కున్నామని.. కేంద్ర సాయంతో నిలదొక్కుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు.


సూపర్ సిక్స్ అమలు చేసే బాధ్యత తమదని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ అండతో రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయని చెప్పారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి.. కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతాలుగా మారుతున్నాయని చెప్పారు. అరకు కాఫీని మోడీ బాగా ప్రచారం చేస్తున్నారన్నారు.

ఏ సమస్య చెప్పినా.. ప్రధాని మోడీ వెంటనే అర్థం చేసుకుంటారని.. ఆ వెంటనే పనులు జరిగేలా చొరవ చూపిస్తారని చంద్రబాబు చెప్పారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంతలా చొరవ చూపలేదన్నారు. మనదేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉన్నారని మోడీపై ప్రశంసలు కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+