ఏపీ బ్రాండ్ ఇమేజిని కాంగ్రెస్ దెబ్బతీసింది, నేను ప్రమోట్ చేస్తున్నా: చంద్రబాబు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ చేరుకున్నారు. ఐదు రోజుల చైనా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి, రాష్ట్రానికి అందాల్సిన సాయం, విభజన చట్టంలో పేర్కొన్న కేటాయింపుల గురించి చర్చించారు.
అనంతరం విజయవాడ చేరుకున్న ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పలువురు టీడీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి, దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం చైనా పర్యటనకు సంబంధించిన విశేషాలను ఆయన శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తెచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని కాంగ్రెస్ దెబ్బతీసిందన్నారు. ఈ క్రమంలో ఏపీ బ్రాండ్ ఇమేజిని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండో తరం పారిశ్రామిక వేత్తలను తయారు చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు.
బయటివారు మన దగ్గర వ్యాపారం చేసే రోజులు రావాలన్నారు. చాలా చైనా కంపెనీలు ఇటీవల కాలంలో భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. భారత్ కంటే ముందే చైనాలో సంస్కరణలు అమలయ్యాయని తెలిపారు. చైనా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ప్రయత్నాలు చేశానన్నారు.
స్పీడ్, స్కిల్, స్కేల్‌కు చైనా మరో పేరుగా ఉందన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చైనా ముందుకొచ్చిందన్నారు. ప్రపంచంలో హైస్పీడ్ రైళ్లన్నీ 60 శాతం చైనాలోనే ఉన్నాయన్నారు. మన దేశంలో 500కు పైగా చైనా కంపెనీలున్నాయన్నారు. అందుకే చైనా భాగస్వామ్యంతో రాజధానిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరామన్నారు.
పూలింగ్ ద్వారా రాజధాని అమరావతికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం ఓ చరిత్రగా అభివర్ణించారు. మనదగ్గర పట్టణాలు డిమాండ్ తో ఏర్పడుతున్నాయని, కానీ డిజైన్ ప్రకారం ఏర్పడాలని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో చైనా భాగస్వామ్యం అవుతుందన్నారు.
"గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్లివచ్చిన తర్వాత నాతో మాట్లాడుతూ, చైనాలో 50 అంతస్తుల భవనం కేవలం 30 రోజుల వ్యవధిలో నిర్మించారని చెప్పారు. అలాంటి సామర్థ్యంతో భవనాలు నిర్మించే వెసులుబాటు మీకు ఉందని ప్రధాని నాతో చెప్పారు. ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. దానిని అందిపుచ్చుకుంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు" ఆయన అన్నారు
ప్రపంచంలో నెంబర్ వన్ పెట్టిబడి దారులు యాదులని చెప్పిన చంద్రబాబు మన దగ్గర కూడా అంతటి శక్తి సామార్థ్యాలు కలిగిన వారున్నారన్నారు. నా బెస్ట్ ప్రెండ్ టెక్నాలజీ అని చెప్పిన చంద్రబాబు ఏపీ విధానాలనే కేంద్రం అవలంభిస్తోందన్నారు. ఏపీని పునఃనిర్మించడంపైనే తన దృష్టంతా అని చెప్పుకొచ్చారు.
సైబర్ సెక్యూరిటీ కోసం ఓ అవగాహన చేసుకున్నామని ఆయన తెలిపారు. త్వరలో చేయనున్న సర్వేతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజల ప్రతి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటుందని ఆయన చెప్పారు. జీరో నుంచి మొదలుపెట్టి, ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు కంకణం కట్టుకున్నానని చెప్పారు.
తాను మొత్తం ఐదు రోజులు చైనాలో ఉన్నానని చెప్పిన చంద్రబాబు అక్కడి ప్రభుత్వంతో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అమరావతి నిర్మాణంలో ఎక్కడైతే వాళ్లు ఏమి సాయం చేయగలుగుతారో అక్కడ వారు సాయం చేస్తారన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications