వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు, ఇప్పుడు దెబ్బతీద్దాం!: జగన్‌పై బాబు పక్కా ప్లాన్

తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి ప్రారంభించింది. గిడ్డి ఈశ్వరి సోమవారం టీడీపీలో చేరారు. ఆమె తర్వాత మరో ముగ్గురు నలుగురు వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుక

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి ప్రారంభించింది. గిడ్డి ఈశ్వరి సోమవారం టీడీపీలో చేరారు. ఆమె తర్వాత మరో ముగ్గురు నలుగురు వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.

జగన్‌తో విసిగిపోయా, అన్ని చెప్తా: గిడ్డి సంచలనం, విజయసాయికి షాక్, ఆగ్రహానికి కారణాలివే!జగన్‌తో విసిగిపోయా, అన్ని చెప్తా: గిడ్డి సంచలనం, విజయసాయికి షాక్, ఆగ్రహానికి కారణాలివే!

ఇందుకోసం టీడీపీ లోలోపన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు అన్న చందంగా టీడీపీ వ్యూహాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గిడ్డి ఈశ్వరికి ముందు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి చడీచప్పుడు కాకుండా టీడీపీలో చేరారు.

నేను వెళ్లను, గిడ్డి ఈశ్వరికి ఆదిలోనే గట్టి షాక్: చర్చలు ఫలించాయా?నేను వెళ్లను, గిడ్డి ఈశ్వరికి ఆదిలోనే గట్టి షాక్: చర్చలు ఫలించాయా?

మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్

మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్

మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ వెనుక టీడీపీకి ఎన్నో ప్లాన్‌లు ఉన్నాయి. పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం, ఆయాచోట్ల టీడీపీ బలం పెంచుకోవడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు రాజ్యసభ ఎన్నికలకు కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఏపీకి మూడు రాజ్యసభ స్థానాలు

ఏపీకి మూడు రాజ్యసభ స్థానాలు

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు స్థానాలు లభిస్తాయి. ఈ మూడింటిలో ప్రస్తుతం ఉన్న బలాబలాలను పరిశీలిస్తే టీడీపీకి రెండు, వైసీపీకి ఒక స్థానం దక్కుతాయి. కానీ ఆ ఒక్క స్థానం కూడా వైసీపీకీ దక్కకుండా చేయాలని టీడీపీ కంకణం కట్టుకుంది.

నాడు దెబ్బకొట్టాలనుకున్నప్పటికీ ఫలితం లేదు

నాడు దెబ్బకొట్టాలనుకున్నప్పటికీ ఫలితం లేదు

గత రాజ్యసభ ఎన్నికల్లోనే వైసీపీకి ఒక్క స్థానం రాకుండా చేయాలని టీడీపీ ప్రయత్నాలు చేసింది. కానీ అది కుదరలేదు. అప్పుడు వైసీపీ గెలవాల్సిన రాజ్యసభ విజయ సాయి రెడ్డికి వచ్చింది. విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపించే జగన్ ప్రయత్నాలను దెబ్బతీయాలని అప్పుడు టీడీపీ భావించినా దెబ్బ కొట్టలేకపోయింది.

ఈసారి షాకిచ్చేందుకు టీడీపీ సిద్ధం

ఈసారి షాకిచ్చేందుకు టీడీపీ సిద్ధం

కానీ, ఈసారి దెబ్బకొట్టాలని టీడీపీ బలంగా నిర్ణయించుకుంది. అందుకే మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపడంతో పాటు అందుకోసం బాగా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఈసారి పాదయాత్ర సమయంలోనే ప్రజాప్రతినిధులను చేర్చుకొని, అదేవిధంగా రాజ్యసభ దక్కకుండా చేయడం ద్వారా వైసీపీని గట్టిగా దెబ్బతీయాలని భావిస్తున్నారు.

సాంకేతికంగా చూస్తే ఇదీ

సాంకేతికంగా చూస్తే ఇదీ

ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. గిడ్డి ఈశ్వరిని కలుపుకుంటే 23 అవుతుంది. సాంకేతికంగా చూస్తే భూమా నాగిరెడ్డి మృతి అనంతరం భూమా బ్రహ్మానంద రెడ్డి టీడీపీ టిక్కెట్ పైన గెలిచారు. కాబట్టి ఆ చేరిక 22 అవుతుంది.

మరో ముగ్గురు నలుగురు చేరితే టీడీపీకి రాజ్యసభ

మరో ముగ్గురు నలుగురు చేరితే టీడీపీకి రాజ్యసభ

మరో ముగ్గురు లేదా నలుగురు చేరితే మూడు సీట్లను టీడీపీ గెలుచుకునే అవకాశముంటుంది. ఇందుకోసం సీఎం చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారని అంటున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేవారు ఎవరనే విషయమై స్పష్టంగా తెలియనప్పటికీ కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు గుంటూరు నుంచి మరో ఎమ్మెల్యే టీడీపీతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu Rajya Sabha plan on YSR Congress Party!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X