జగన్ గురించి మాట్లాడటం కంటే: బాబు, ప్యాకేజీపై షాకింగ్, పవన్ కళ్యాణ్-జగన్‌లకు ఝలక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం కన్నా సమస్యల గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని ఏపీ సీఎం,
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం కన్నా సమస్యల గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

జగన్ గురించి పెద్దగా మాట్లాడవద్దు
పార్టీ నేతల భేటీలో చంద్రబాబు మాట్లాడారు. అప్రధానమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడవద్దని నేతలకు సూచించారు. ఎమ్మెల్యేల్లో సీరియస్‌నెస్ ఉండాలని, సీరియస్ విషయాలపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలన్నారు. జగన్ వంటి వారి గురించి పెద్దగా మాట్లాడవద్దని సూచించారు.

జగన్ గురించి మాట్లాడటం కంటే
జగన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని చంద్రబాబు సూచించారు. కోర్టుల వద్ద జగన్ వాదన వీగిపోతోందన్నారు. గ్రీన్ ట్రైబ్యునల్ వద్ద వాళ్ల వాదన వీగిపోయిందని గుర్తు చేశారు. కాబట్టి జగన్ గురించి మాట్లాడటం కంటే సమస్యలపై మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని చెప్పారు.

అసెంబ్లీలో ప్యాకేజీ గురించి
చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు. కొత్తగా ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పిందని, అందుకే ప్యాకేజీకి అంగీకరించామని చెప్పారు. విభజన హామీల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు.

ప్యాకేజీ లెక్క తేలలేదని ఆసక్తికర వ్యాఖ్యలు
ప్యాకేజీ ఇంకా ఫైనల్ కాలేదని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ఎంత ఇస్తుందనే విషయమై స్పష్టత రాలేదని తెలిపారు. సమస్యలు చాలా ఉన్నాయని, నిధులు చాలా అవసరమని వెల్లడించారు.

హోదాపై పోరాడాలంటే ఢిల్లీ వెళ్లండి
అంతేకాదు, ప్రత్యేక హోదా కోసం ఏపీలో పోరాటం చేసే వాళ్లపై కూడా చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేసేవాళ్లు ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని హితవు పలికారు. ఇలాంటి ఆందోళనలతో ప్రజల్లో అభద్రతా భావం కనిపిస్తోందని చెప్పారు. విభజన హామీలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పారు.

బాబు వ్యాఖ్యలు పవన్, జగన్, శివాజీలకు తగులుతాయా?
కాగా, ప్రత్యేక హోదాపై చంద్రబాబు వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హోదా కోసం పోరాడుతున్న నటుడు శివాజీకి కూడా ఇవి వర్తిస్తాయని చెప్పవచ్చు. వీరంతా హోదా కోసం ఏపీలో మాట్లాడుతున్నారు. ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని బాబు సూచించడం గమనార్హం.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం..












Click it and Unblock the Notifications