Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాయలసీమపై చంద్రబాబు ఫోకస్.. పూర్వోదయ, స్పెషల్ ప్యాకేజీ కోసం కేంద్రానికి వినతి!

ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ అభివృద్ధి పైన ఫోకస్ చేసిన చంద్రబాబు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సహకరించవలసిందిగా కేంద్రాన్ని కోరుతున్నారు. ఏపీ వ్యూహాత్మక అభివృద్ధికి ఆర్థిక చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కోరారు.

ఆ నిధుల కోసం కేంద్రమంత్రిని కలిసిన చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రితో పాటు కేంద్ర జలశక్తి, నౌకాయాన, పట్టణాభివృద్ధి, విద్యుత్, పెట్రోలియం శాఖల మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధికి కావలసిన అనేక కీలక విషయాలపైన వారితో చర్చించారు. నిర్మల సీతారామన్ తో భేటీలో పూర్ణోదయ పథకం నిధులు, మూలధన వ్యయం కోసం ప్రత్యేక సాయం అందించాలని కోరారు. పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుల నిధుల పైన కూడా చంద్రబాబు చర్చించారు.

పూర్వోదయ నిధులు అత్యవసరం అన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని చెబుతూ, కేంద్రం నుంచి దక్షిణ సాయం చేయవలసిన అవసరాన్ని ఆయన నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామీణ ప్రాంతాలలో రహదారులు అనుసంధానం, సాగునీటి వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లు, ఆహార శుద్ధి క్లస్టర్లు, విద్యా, వైద్య సౌకర్యాల కల్పనకు పూర్యోదయ నిధులు అత్యవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు.

Chandrababu Naidu Seeks central Funds for Purnodaya Scheme special package for rayalaseema

నిధులు అత్యవసరం అన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ నిధులను అత్యవసరంగా కేటాయించాల్సి ఉందని ఆయన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ప్రత్యేక సాయం కింద మూలధన వ్యయం కోసం పదివేల 54 కోట్ల రూపాయలను విడుదల చేయాలని చంద్రబాబు కోరారు.

ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి
రహదారులు, msme పార్కులు, సాగునీటి ప్రాజెక్టులు, గృహ నిర్మాణం, వైద్య సదుపాయం వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులు కీలకమని. ఇవి సంపద సృష్టికి దోహదం చేస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాయలసీమను ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దడం కోసం 2026- 27 బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని ఆయన పేర్కొన్నారు.

ఉద్యాన పంటల సాగుపై చంద్రబాబు
ప్రపంచ డిమాండ్ ఉన్న 18 ప్రధాన ఉద్యాన పంటల సాగు రాయలసీమ, ప్రకాశం జిల్లాలో జరుగుతుందన్నారు. 8 జిల్లాలలోని 93 క్లస్టర్ లపై 33.7 లక్షల మంది రైతులు ఆధారపడి ఉన్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే మూడు సంవత్సరాలలో 41 వేల కోట్ల రూపాయలతో రైతుల వార్షిక ఆదాయం 3.5 లక్షలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+