• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాటకు మాట: 'గో బ్యాక్'ను పాజిటివ్‌గా తీసుకున్న మోడీ, బాబుకు ఆరు గట్టి చురకలివే! నవ్విన పురంధేశ్వరి

|

గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఉత్కంఠను రేపింది. అడుగడుగునా టీడీపీ, లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలిపారు. అదే సమయంలో బీజేపీ కూడా మోడీ సభను ఘన విజయం చేసి చూపించింది. ఏపీ సీఎం ప్రధాని ఘాటుగానే స్పందించారు. ఏపీకి ఏమిచ్చామో చెప్పారు. ఏపీకి ఏదైనా జరగలేదని ప్రజలు భావిస్తే అందుకు చంద్రబాబుదే తప్పని చెప్పారు. కేంద్రం ఇచ్చిన లెక్కలు చూపించడం లేదని, దాని వెనుక మర్మం ఏమిటో తెలియాలన్నారు.

అందుకే అవినీతి కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టారని చెప్పారు. తన పర్యటన సందర్భంగా చంద్రబాబుపై మోడీ నవ్వుతూ ఎన్నో సెటైర్లు వేయగా, చంద్రబాబు తన తదుపరి సభలో ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు సహా పలు అంశాల్లో చంద్రబాబు తన కంటే సీనియర్ అని మోడీ అన్న సందర్భంలో వేదికపై ఉన్న పురంధేశ్వరి ముసిముసి నవ్వులు నవ్వారు. చంద్రబాబుపై మోడీ వేసిన చురకలు ఇలా ఉన్నాయి.

బాబు నాతో చెప్పారు కానీ, నిధుల లెక్క అడిగినందుకే, కాంగ్రెస్ దోస్తీకి 4 కారణాలు: గుంటూరులో మోడీ

కన్నాగారూ.. ఈ సభకు ఎవరు ఖర్చు పెట్టారు

కన్నాగారూ.. ఈ సభకు ఎవరు ఖర్చు పెట్టారు

చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మపోరాట దీక్ష వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్నారని వైసీపీ, జనసేన, బీజేపీలు నిత్యం విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాదు, సోమవారం ఢిల్లీలో నిర్వహించనున్న చంద్రబాబు దీక్షకు దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఏపీ నుంచి వెళ్లే రెండు రైళ్లకే రూ.1.12 కోట్లు చెల్లించారని వార్తలు వచ్చాయి. దీనిని ఉద్దేశించి మోడీ స్పందించారు. కన్నా (లక్ష్మీనారాయణ) గారూ.. ఈ సభకు ఎవరు ఖర్చు పెట్టారని మోడీ ప్రశ్నించారు. దానికి కన్నా పార్టీ ఖర్చు చేసిందని చెప్పారు. అప్పుడు మోడీ తిరిగి స్పందిస్తూ.. మేం చంద్రబాబులా కాదని, బాబు ఢిల్లీ ఖర్చు అంతా ప్రభుత్వానిదేనని, ఇక్కడ మేం ఇంత పెద్ద సభ పెట్టినా పార్టీ ఫండ్ నుంచి ఖర్చు చేసేదేనని, కానీ ట్యాక్స్ ప్లేయర్, ప్రజల సొమ్మును ఖర్చు చేయడం లేదని చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చారు.

స్కూల్లో విద్యార్థి కథ చెప్పిన మోడీ

స్కూల్లో విద్యార్థి కథ చెప్పిన మోడీ

మోడీ పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు గో బ్యాక్ అంటూ ప్రదర్శనలు చేశారు. దీనిపై మోడీ స్పందిస్తూ... స్కూల్లో విద్యార్థిని పిలిచి గో బ్యాక్ అంటే మీ సీట్లో మీరు కూర్చోండని అర్థమని, ఇప్పుడు తన విషయంలోను టీడీపీ అదే చేస్తోందన్నారు. గో బ్యాక్ అంటే ఇప్పటి వరకు తాను ఢిల్లీలో (ప్రధానమంత్రి) కూర్చున్నానని, త్వరలో ఎన్నికలు వస్తున్నందున మళ్లీ వెళ్లి కూర్చోమని చెబుతున్నారని, గో బ్యాక్ అన్నందుకు థ్యాంక్స్ అని చెప్పారు. నేను మళ్లీ అధికారంలోకి రాబోతున్నానని, చంద్రబాబు చెప్పినట్లే ఢిల్లీలో కూర్చుంటానని చెప్పారు. కానీ ఏపీలో తండ్రీ కొడుకుల పాలన అంతం కాబోతుందన్నారు. తనకు కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదం ఉందని, చంద్రబాబు చెప్పినట్లే ఢిల్లీలో మరోసారి కూర్చోబెట్టే కార్యక్రమంలో ఉన్నారని చెప్పారు.

ఆ తర్వాత సభలో దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... గో బ్యాక్ అంటే మేం గుజరాత్ తిరిగి వెళ్లిపోమని చెప్పినట్లు అని తెలిపారు.

లోకేష్ తండ్రి.. జశోదాబెన్ భర్త: వ్యక్తిగతంగా వెళ్లింది ఎవరు..

లోకేష్ తండ్రి.. జశోదాబెన్ భర్త: వ్యక్తిగతంగా వెళ్లింది ఎవరు..

మోడీ తన గుంటూరు పర్యటనలో చంద్రబాబును ఉద్దేశించి పలుమార్లు లోకేష్ తండ్రి అని వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ రాజకీయాల్లో ఉన్న లోకేష్‌ను మాత్రమే ఉద్దేశించి.. లోకేష్ తండ్రి అని (చంద్రబాబు అని అర్థం వచ్చేలా) చెప్పారు.

కానీ ఆ తర్వాత సభలో చంద్రబాబు మాత్రం ఊగిపోయారు. తనను లోకేష్ తండ్రి అని చెప్పారని, దానికి తాను గర్వపడుతున్నానని, ఇలా వ్యక్తిగతంగా మాట్లాడారని, ఇది తనను బాధించిందని, తనకు సంస్కారం ఉందని, వ్యక్తిగతంగా మాట్లాడనని చెబుతూనే, మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీకి కుటుంబం విలువ తెలియదని, జశోదాబెన్‌కు విడాకులు ఇవ్వకుండానే వచ్చేశారని, కన్న తల్లికి అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జశోదాబెన్ భర్త అన్నారు. జశోదాబెన్ భర్త వరకు ఫరవాలేదు.. కానీ మరీ లోతుగా పర్సనల్ వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. లోకేష్ రాజకీయాల్లో ఉన్నందున లోకేష్ తండ్రి అన్నారు.

అవును.. ధనార్జన తెలియదు

అవును.. ధనార్జన తెలియదు

నరేంద్ర మోడీకి ధనార్జన ఎలా తేయాలో తెలియదని ఇటీవల చంద్రబాబు చెప్పారని, అది నిజమేనని, మీలా అవినీతికి పాల్పడలేదని ప్రధానమంత్రి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన డబ్బులకు లెక్క చెప్పలేదన్నారు. అందుకే అవినీతి కాంగ్రెస్ పార్టీతో జత కట్టారన్నారు.

ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.

మన పిల్లల్ని కాదు.. ప్రజలందరూ సమానమే

మన పిల్లల్ని కాదు.. ప్రజలందరూ సమానమే

లోకేష్ తండ్రిగా మోడీ పేర్కొన్నా.. జశోదాబెన్ భర్తగా చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. అయితే చంద్రబాబు అంతటితో ఆగకుండా కుటుంబం దాకా వెళ్లారు. సభ్యత ఉందంటూనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అంతకముందే మోడీ ప్రసంగంలో చంద్రబాబుకు కౌంటర్ పడిందని భావిస్తున్నారు. మోడీ మాట్లాడుతూ.. మనలకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, అందుకే అందరినీ సమానంగా చూడాలని చంద్రబాబుకు హితవు పలికారు. మన అమ్మాయిని, మన అబ్బాయినే చూడవద్దని ముఖ్యమంత్రికి సూచించారు.

నల్ల చొక్కాలతో.. నా శుభారంభానికి నాంది పలికారు

నల్ల చొక్కాలతో.. నా శుభారంభానికి నాంది పలికారు

తనకు నల్లటి చొక్కాలు, నల్లటి బెలూన్లతో టీడీపీ నేతలు నిరసన తెలపడంపై మోడీ స్పందించారు. ఇది తన శుభారంభానికి (వచ్చే ఎన్నికలకు) నాంది అన్నారు. ఏదైనా దిష్టి తీసినప్పుడు ఇలాగే చేస్తారని, టీడీపీ తన శుభారంభానికి ఇక్కడ నాంది పలికిందని చెప్పారు. మీరే మాకు దిష్టి తీశారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ... మోడీని తిరిగి తాము కోరుకోవడం లేదని చెప్పారు.

 చివరలో జై ఆంధ్రా, భారత్ మాతాకీ జై నినాదాలు

చివరలో జై ఆంధ్రా, భారత్ మాతాకీ జై నినాదాలు

నరేంద్ర మోడీ చివరలో జై ఆంధ్రా, భారత్ మాతాకీ జై నినాదాలు చేయించారు. మూడు నాలుగుసార్లు.. జై ఆంధ్రా అన్నారు. అంతరం భారత్ మాతాకీ జై అన్నారు. ఆయనతో పాటు సభకు వచ్చిన అశేష జనవాహిని కూడా నినాదాలు చేసింది. మొత్తంగా ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత మోడీ ఏపీకి వచ్చి చంద్రబాబును నేరుగా అటాక్ చేశారు. చంద్రబాబు పదేపదే సీనియర్ అని చెప్పుకోవడంపై కూడా ఘాటుగానే స్పందించారు. ఊరికే అలా చెప్పుకోవడం ఎందుకని, నీవే సీనియర్ అంటూ మామకు వెన్నుపోటు పొడిచాడని, అవకాశవాద రాజకీయాలు చేస్తాడని ఆరోపించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi on his first visit to Andhra Pradesh, after the Telugu Desam Party (TDP) broke out of an alliance with the BJP last year, launched a string of attacks on Chief Minister and political rival Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more