నమ్మితే నాకు ద్రోహం చేశారు, 'శిల్పా'పై బాబు సంచలనం
ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు.ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్లను భూమా బ్రహ్మనందరెడ్డికి.
నంద్యాల: నేను నమ్మినవారే నాకు నమ్మకద్రోహం చేశారు. అభివృద్దికి అడ్డుగా నిలిచారని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డిపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్న కాలంలో శిల్పా చేసిన అవినీతిని ప్రచారం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.
ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు.ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్లను భూమా బ్రహ్మనందరెడ్డికి ఎందుకు ఓటు చేయాలో వివరించాలని ఆయన కోరారు.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అయితే ఈ షెడ్యూల్ విడుదల కానున్నందున అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు టిడిపి ప్రయత్నాలను ప్రారంభించింది.
ఈ మేరకు రెండురోజుల పాటు చంద్రబాబునాయుడు నంద్యాలలో మకాం వేశారు. ఈ నెల 22, 23 తేదిల్లో బాబు నంద్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు.
ఉప ఎన్నికల్లో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై బాబు పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. అంతేకాదు ప్రత్యర్థుల వ్యూహలను ఏ రకంగా తిప్పికొట్టాలనే దానిపై కూడ ఆయన పార్టీ నేతలకు సూచనలుచేశారు.
Recommended Video


నాకు ద్రోహం చేశారు
నేను నమ్మినవారు నాకు నమ్మకద్రోహం చేశారు. తన నమ్మకాన్ని వమ్ముచేశారు. అభివృద్దికి అడ్డుగా నిలిచారని ఆయన పరోక్షంగా శిల్పా మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. డబ్బు ఉందని రాజకీయాలు చేస్తున్నారు. ఆ డబ్బుల ఎలా వచ్చిందో అలానే పోతోంది. వారి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని బాబు పార్టీ కార్యకర్తలను కోరారు.

శిల్పా తీరును ఎండగట్టాలి
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న సమయంలో శిల్పా మోహన్‌రెడ్డి ఇందూ ప్రాజెక్టు పేరుతో చేసిన అవినీతిని ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ స్థలం కేటాయించి ఇళ్ళ వ్యాపారం చేశారని ఆయన శిల్పా మోహన్‌రెడ్డిపై పరోక్ష ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని పెద్దఎత్తున ప్రచారం చేయాలని ఆయన కోరారు. . అలాగే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది ఫలాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబునాయుడు కార్యకర్తలకు కోరారు.

ఇంటింటికి ఇలా ప్రచారం చేయాలి
ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎలా ప్రచారం చేయాలో కూడ పార్టీ కార్యకర్తల సమావేశంలో బాబు వివరించారు. ప్రతి రోజూ ఉదయమే ప్రతి ఇంటికి వెళ్ళి టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని కోరాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పిలుస్తూ ఓట్లను అభ్యర్థించాలని బాబు కోరారు.

ఉప ఎన్నికపై దేశవ్యాప్త చర్చజరగాలి
నంద్యాల ఉప ఎన్నికపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై రాజకీయ సంప్రదాయాలకు వైసీపీ ఏ రకంగా తిలోదకాలను ఇచ్చిందనే విషయమై చర్చకు పెట్టాల్సిన అవసరాన్ని ఆయన పార్టీ క్యాడర్‌కు వివరించారు. ఈ స్థానం నుండి పోటీలో ఉన్న టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డికి 50వేల మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు ఎస్ఆర్‌బిసి కాలనీలో 12 వేల ఇళ్ళ నిర్మాణాలకు బూమి పూజ చేసిన తర్వాత రాత్రిపూట ఆయన ప్రధానవీధుల్లో పర్యటించారు. నంద్యాల, గోస్పాడు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు.












Click it and Unblock the Notifications