Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విభజన గాయం ఉంది, ఆటలు సాగవ్: బాబు, బాలకృష్ణ సినిమాలు చూడొచ్చు

అమరావతి: తెలుగుజాతి వద్ద ఎవరి ఆటలు సాగవని, విభజన గాయాలు ఇంకా మానలేదని, తెరాసతో కలిసి జగన్ కుట్ర చేస్తున్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు మంగళగిరి వద్ద నిర్వహించిన మహా సంకల్ప దీక్షలో అన్నారు.

ప్రజల ఉత్సాహం చూస్తుంటే తనకు ఆనందం వేస్తుందని, ఈ మహాసంకల్పం కడ వరకు ఉండాలన్నారు. తెలుగుజాతి అంతా గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తికి పునరంకితం కావాలన్నారు. సన్ రైజ్ ఏఫీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకే సంకల్పం అన్నారు.

విభజన వల్ల వచ్చిన గాయాలు ఇంకా మానలేదన్నారు. విభజనతో జరిగిన అన్యాయం, కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన తీరు మన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేమన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశామన్నారు. కుట్రలో భాగస్వాములైన వైసీపీకి బుద్ధి చెప్పారన్నారు.

అయినప్పటికీ వారికి బుద్ధి రాలేదన్నారు. వారు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ తన దేశమైన ఇటలీ స్వాతంత్రాన్ని తీసుకొని విభజన చేశారని ఆరోపించారు. విభజన తీరు సరిగా జరగలేదని, అలాంటి వారిని చరిత్ర మరిచిపోదన్నారు.

 Chandrababu Naidu speech in Maha Sankalpam

తెరాసతో కలిసి జగన్ కుట్ర

వైసీపీ అవినీతి, కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. తెరాసతో కలిసి కుట్రలు చేస్తోందని జగన్ పైన మండిపడ్డారు. నేను కష్టపడి పని చేస్తానని చంద్రబాబు అన్నారు. మేం ఎన్టీఆర్ వంటి మహానాయకుడి వద్ద శిక్షణ పొందామన్నారు. ఎన్ని సమస్యలు వచ్చిన సునాయాసంగా ఎదుర్కొంటామన్నారు.

సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటామన్నారు. అందుకు ప్రజలు, కార్యకర్తల ఆశీస్సులు కావాలన్నారు. ఆశీస్సులు ఉంటే నేను ఏపీని దేశంలో మొదటి స్థానానికి తీసుకు వెళ్లేదాకా వదిలి పెట్టనని చెప్పారు. ఏపీ పెద్ద మొత్తం లోటు బడ్జెట్లో ఉందన్నారు.

మిగతా వారు అయితే భయపడేవారని, నేను మాత్రం హామీలను తప్పకుండా నెరవేర్చుతానని చెప్పారు. విభజన ఓ పీడకల అన్నారు. అది అవమానమని, ఆ గాయాన్ని మన మనసు నుండి ఎవరూ తీయలేరన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుందామని చెప్పారు.

పోలవరం ఆంధ్రప్రదేశ్ హక్కు

పోలవరం ఏపీ హక్కు అన్నారు. గోదావరి జలాలను వినియోగించుకోవాలన్నారు. పోలవరం కోసం ప్రధాని మోడీ తెలంగాణలోని ఏడు మండలాలను మనకు ఇచ్చారన్నారు. దాంతో పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలిగాయని చెప్పారు.

 Chandrababu Naidu speech in Maha Sankalpam

భూగర్భ జలాలను పెంచుతామని, నీరు చెట్టు కార్యక్రమం ద్వారా వర్షం నీటిని భూగర్భ జలంగా మారుస్తామన్నారు. అన్ని కాలువలు పూర్తి చేస్తామని, ఏపీని సస్యశ్యామలం చేస్తామన్నారు. తనకు అందరు సహకరించాలని కోరారు. ఆ సంకల్పం కోసమే ఇక్కడ సమావేశమయ్యామని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో నేను సంకల్పం చేశానంటే బుల్లెట్‌లా దూసుకెళ్తానని చెప్పారు.

రాజధాని లేకుండా విభజన

రాజధాని లేకుండా విభజన చేశారన్నారు. విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలు చేశారన్నారు. ఏపీలో మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా చేసే ప్రయత్నం చేస్తే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. అమరావతి మధ్యలో ఉందని, అందుకే రాజధానిగా నిర్ణయించామన్నారు.

రైతులు 33వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారని, రైతుల త్యాగం నేను జీవితంలో మరిచిపోనని చెప్పారు. రైతులు స్వచ్ఛంధంగా భూములు ఇస్తే, విపక్షాలు రాధ్దాంతం చేసే ప్రయత్నం చేశాయన్నారు. రైతులకు నేను పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు.

ఏపీలో పేదవారికి అండగా ఉంటామని చెప్పారు. మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. అభివృద్ధి, ఉద్యోగాలు కోసం కార్యాచరణ తయారు చేశామన్నారు. అమరావతిని భారత్‌కు గేట్ వేగా చేస్తామన్నారు.

హైదరాబాదును నేనే అభివృద్ధి చేశా

 Chandrababu Naidu speech in Maha Sankalpam

హైదరాబాదును నేనే అభివృద్ధి చేశానని చెప్పారు. తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, కర్నాటకకు బెంగళూరు ఉందని, ఏపీకి అమరావతిని ప్రపంచ రాజధానిగా చేసే బాధ్యత తనదే అన్నారు.

ఏపీలో అపార అవకాశాలు

ఎవరికీ లేని భూగర్భ సంపద, జల సంపద ఏఫీకి ఉందని చెప్పారు. తెలివైన ప్రజలు ఉన్నారన్నారు. ఏఫీ నుండి వెళ్లి వివిధ రంగాల్లో రాణించారని చెప్పారు. ఏపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని, అన్ని వనరులు ఉన్నాయని చెప్పారు. ప్రజలు నన్ను నమ్మి ఓటేశారని, అందుకే మీలో నేను నమ్మకాన్ని కలిగించానని చెప్పారు.

నేను స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నానని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందని, అందుకే 2022 నాటికి దేశంలోని మూడు రాష్ట్రాల్లో, 2029 నాటికి దేశంలోనే నెంబర్ వన్‌గా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఐదు సంతకాలు పెట్టాను

తాను గత ఏడాది ఇదే వేదిక పైన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే ఐదు సంతకాలు చేశానని చెప్పారు. డ్వాక్రా సంఘాలకు, రైతులకు రుణమాఫీ కోసం సంతకం పెట్టానని చెప్పారు. పింఛన్ ఇస్తామని చెప్పామన్నారు. సంవత్సరానికి ఆరువేల కోట్లు అవుతుందన్నారు.

పేదవారికి నేను ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పానని, వాళ్ల కొడుకులు చూసుకోకున్నా నేను వారిని చూసుకుంటానని చెప్పారు. ఉద్యోగస్తుల వయస్సును 58 నుండి 60కి పెంచామన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి చేపట్టామన్నారు.

నేను ముఖ్యమంత్రి అయ్యే నాటికి కరెంట్ కొరత బాగా ఉండేదని, ఈరోజు మిగులు కరెంట్ సాధించామన్నారు. మిగతా రాష్ట్రాలకు అమ్మే పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించామని చంద్రబాబు చెప్పారు. అన్ని వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు తెచ్చామన్నారు. హుధుద్ తుఫాను వచ్చినప్పుడు ఆదుకున్నామన్నారు. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

ఎర్రచందనం దొంగవ్యాపారం, చేస్తే వదలను

ఎర్రచందనం దొంగ వ్యాపారమని, దానిని చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు. నన్నేదో చేస్తానని అంటున్నారన్నారు. అక్రమ ఇసుక వ్యాపారాలు జరగనివ్వమని చెప్పారు.

బాలకృష్ణ సినిమాలు చూడొచ్చు

భార్య బయటకు వెళ్తే.. టీవీ చూస్తూ బిర్యానీ చేసుకునేలా చేస్తామన్నారు. వంద రూపాయలకే ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ కనెక్షన్ ఇస్తామన్నారు. హాయిగా సినిమాలు చూసుకోవచ్చన్నారు. కొత్త సినిమాలు, బాలకృష్ణ సినిమాలు చూడవచ్చునన్నారు.

రాష్ట్రానికి అనేక విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని, ఇంకా వస్తాయనిచెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

పడగొట్టిన కాంగ్రెస్, తొడగొట్టి లేవాలి

కాంగ్రెస్ పార్టీ ఏపీని పడగొట్టిందని, మనం ఇక తొడగొట్టి లేవాలన్నారు. సింగపూర్, జపాన్, అమెరికాను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. కానీ కేంద్రం మనకు ఇప్పుడు అండగా ఉందని చెప్పారు.

మోడీ బంగ్లాదేశ్ వెళ్లి నలభై ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని మోడీని బ్రోకర్ అనడం విడ్డూరమన్నారు. ఒక ప్రధానిని అలా అనేందుకు సభ్యత ఉండాలన్నారు. దీనిని మేం ఖండిస్తున్నామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+