సీమాంద్రలో బాబు రెండో దఫా ఆత్మ గౌరవయాత్ర
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండవ దశ తెలుగువారి ఆత్మ గౌరవ యాత్రను చేపట్టనున్నారు. నవంబర్ ఐదో తేదీ నుంచి మళ్లీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి ఆయన కార్యక్రమం రూపొందించుకొంటున్నారు. దీపావళి తర్వాత పర్యటన మొదలుపెట్టి వీలైనన్ని జిల్లాలు పర్యటించేలా ఈ కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
గతంలో ఆయన పది రోజులపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించారు. ఆ తర్వాత మరికొన్ని జిల్లాల్లో పర్యటించాలనుకున్నారు. కానీ వివిధ రాజకీయ పరిణామాల కారణంగా వాయిదా పడింది. ఈ మధ్యలో ఆయన ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు.

తన పర్యటన మొదలు పెట్టేలోపు అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు పెట్టి పార్టీ యంత్రాంగాన్ని కదిలించాలని, తన యాత్రకు సమాంతరంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ నేతల పర్యటనలు ఉండేలా చూడాలని ఆయన భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవ యాత్రను చేపట్టనున్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ కుట్ర చేసిందని, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితోనూ సీమాంధ్రలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతోనూ కుమ్మక్కయ్యిందని చెప్పడానికి ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications