టీడీఎల్పీ చీఫ్‌గా- గవర్నర్‌తో అపాయింట్‌మెంట్
Chandrababu Naidu: ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. విజయవాడలో తుదిదశకు చేరుకున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం విభజనాంధ్ర ప్రదేశ్‌లో ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోనున్నారు.

ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ అధినేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. విజయవాడలో ఏర్పాటైన టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ఈ ప్రక్రియ పూర్తయింది. టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పవన్ కల్యాణ్, దగ్గుబాటి పురంధేశ్వరి.. ఆయన పేరును ప్రతిపాదించారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అంతకంటే ముందే- జనసేన శాసన సభాపక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ శాసన సభ్యులు పవన్‌ను తమ అధినాయకుడిగా ఎన్నుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్.. టీడీఎల్పీ భేటీకి హాజరయ్యారు.
దీని తరువాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, భువనేశ్వరి.. రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. తనకు మద్దతు ఇస్తోన్న శాసన సభ్యుల సంతకాలతో కూడిన లేఖను ఈ సందర్భంగా చంద్రబాబు.. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు అందజేయనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరుతారు.
అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మొత్తం 164 మంది సభ్యుల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇందులో టీడీపీ- 135, జనసేన- 21, బీజేపీ- 8 మంది సభ్యులు ఉన్నారు. మంగళవారం చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద దీనికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి.












Click it and Unblock the Notifications