చంద్రబాబు అసహనం
అమరావతి: పోలవరం నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవడంపై అధికారులపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సైట్‌కు పూర్తిస్థాయిలో మిషనరీ చేరకపోవడంతో పనులు వేగవంతం చేయలేకపోయామని అధికారులు వివరణ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ పై సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. జనవరి నాటికి స్పిల్ వే, మే నాటికి స్పిల్ చానల్ తవ్వకం పనులు, వచ్చే మార్చి నాటికి పవర్ హౌస్ పనుల పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఏడాది చివరికల్లా గేట్ల డిజైన్‌పై అనుమతులు పొందాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమ, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications