హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూణ్ణెళ్ల తర్వాత హైద్రాబాద్‌లో: కారు దిగి కష్టాల్లో ఉన్న కార్యకర్తని గుర్తుపట్టిన బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు మూడు తర్వాత హైదరాబాదులోని సచివాలయంలో అడుగు పెట్టారు. విజయవాడకు కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపునకు సంబంధించి కీలక చర్చలు జరిపారు. అనంతరం సచివాలయం నుంచి వెళ్తూ... ఓ మహిళను కారు దిగి మరీ పలకరించారు.

సచివాలయం నుంచి ఇంటికి వెళుతున్న సీఎం చంద్రబాబు.. టిడిపి కార్యకర్త పారమ్మను గుర్తించి పేరుపెట్టి మరీ పలకరించారు. ఆమెకు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనారోగ్యానికి గురై అప్పులపాలైన విజయనగరం జిల్లా పనుకవలస తండాకు చెందిన పారమ్మ కొద్దిరోజులుగా సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సచివాలయంలోని సీఎం కార్యాలయం సమీపంలో పడిగాపులు కాస్తోంది. శనివారం తన కార్యాలయం నుంచి ఇంటికెళ్తున్న చంద్రబాబు.. అక్కడున్న పారమ్మను గుర్తించి వెంటనే డ్రైవరును వాహనాన్ని ఆపమని కిందకు దిగారు. పారమ్మ వేగంగా సీఎం చంద్రబాబు వద్దకు చేరుకొని తన పరిస్థితిని వివరించారు.

ఈ ఏడాది మే నెలలో అనారోగ్యం పాలై వైద్యానికి లక్షలు ఖర్చయ్యాయని, మిమ్మల్ని కలిసేందుకు చాలారోజులుగా ప్రయత్నిస్తున్నానని చెప్పింది.

స్పందించిన చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.50 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని పారమ్మ విలేకరులతో చెప్పారు. చంద్రబాబు గతంలో తనకు జడ్పీటీసీ సభ్యురాలిగా అవకాశం ఇచ్చారని, తన సేవలకు నాటి రాష్ట్రపతి కెఆర్ నారాయణన్‌ నుంచి పురస్కారం లభించిందని పారమ్మ తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో పాలనా వ్యవహారాలన్నింటినీ విజయవాడ కేంద్రంగానే పర్యవేక్షిస్తున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు విజయవాడలోనే తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారానికో, రెండు వారాలకో హైదరాబాద్ వస్తున్న ఆయన ఒకటి, రెండు రోజుల్లోనే తిరిగి విజయవాడ వెళ్తున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాదు వచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

శనివారం సచివాలయంలో అడుగు పెట్టారు. ఎల్ బ్లాకులో తన కార్యాలయంలో ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు మూడు తర్వాత హైదరాబాదులోని సచివాలయంలో అడుగు పెట్టారు.

English summary
AP CM Chandrababu Naidu Review Meeting At AP Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X