వారిని మోసుకెళ్లారు: పిఎస్‌కు చంద్రబాబు (పిక్చర్స్)
హైదరాబాద్: వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలోని సమతా బ్లాక్ వద్ద ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పోలీసులు గురువారంనాడు అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలకు ఆహ్వానించారు.
అయితే తమ వద్దకే వచ్చి చర్చలు జరపాలంటూ తెలుగుదేశం నేతలు పట్టుబట్టారు. వారు ఎంతకి కదలకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమను సీఎం చర్చలకు పిలవకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పోలీసులు సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోలీసు స్టేషనుకు చేరుకున్నారు. ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

సచివాలయంలో బైఠాయింపు
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యాలయం ఉన్న సమతా బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు.

పోలీసులు ఇలా..
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ధర్నా చేసిన సందర్భంగా పోలీసులు ఇలా కనిపించారు. పోలీసులు టిడిపి శాసనసభ్యులను అరెస్టు చేశారు.

ఇలా మోసుకెళ్లారు..
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పోలీసులు ఇలా మోసుకెళ్లారు. దేవినేని ఉమామహేశ్వర రావును మోసుకెళ్తున్న దృశ్యం ఇది..

పోలీసు స్టేషన్‌కు చంద్రబాబు
అరెస్టయిన తమ పార్టీ శాసనసభ్యులను పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు.

మీడియాతో చంద్రబాబు
పోలీసు స్టేషన్ వద్ద చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆయన విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications