ప్రజల్లో చులకనభావం, తక్షణమే బయటకు, బిజెపితో పొత్తుపై బాబు కీలక ప్రకటన?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు రావాలని మెజారిటీ మంత్రులు, టిడిపి ఎంపీలు ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. ఈ విషయమై బాబు కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఏపీకి కేంద్రం నుండి నిధుల కేటాయింపు విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొద్దిసేపట్లో కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబునాయుడు మంత్రులతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. మరో వైపు ఎంపీలతో బాబు బుధవారం రాత్రి టెలికాన్పరెన్స్ నిర్వహించారు.

బిజెపి అనుసరిస్తున్న విధానాలపై టిడిపి తీవ్ర అసంతృప్తితో ఉంది. దీనిపై చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై బాబు సమాలోచనలు చేస్తున్నారు.

బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని నేతల సూచన

బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని నేతల సూచన


బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని మంత్రులు, ఎంపీలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబునాయుడు మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీఏ నుండి బయటకు రావాలని చంద్రబాబునాయుడును మంత్రులు, ఎంపీలు కోరారు

చులకన అయ్యే అవకాశం

చులకన అయ్యే అవకాశం


కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్న ఇంకా కేంద్రంలో కొనసాగితే ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉందని మెజారిటీ మంత్రులు అభిప్రాయపడ్డారు. కేంద్రం తీరు పట్ల టిడిపి నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 తక్షణమే బయటకు రావాని ఎంపీల డిమాండ్

తక్షణమే బయటకు రావాని ఎంపీల డిమాండ్

తక్షణమే ఎన్డీఏ నుండి బయటకు రావాలని టిడిపి ఎంపీలు అభిప్రాయపడ్డారు. టిడిపి ఎంపీలతో చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా టెలికాన్పరెన్స్ నిర్వహించారు.అరుణ్ జైట్లీ ప్రకటనతో కేంద్రం తీరు బట్టబయలైందని ఎంపీలు బాబు దృష్టికి తీసుకొచ్చారు.పరిస్థితిని సరిదిద్దకుండా మరింత పెంచేదిగా చేశారని ఎంపీలు అభిప్రాయపడ్డారు.

టిడిపి, బిజెపి మైత్రిపై కీలక ప్రకటన

టిడిపి, బిజెపి మైత్రిపై కీలక ప్రకటన


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత పార్టీ నేతలతో చర్చించిన చంద్రబాబునాయుడు కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బిజెపి తీరు వల్ల టిడిపి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొన్నందున బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని మంత్రులు, ఎంపీలు అభిప్రాయపడ్డారు. పార్టీ నేతల అభిప్రాయాలతో చంద్రబాబునాయుడు ఏకీభవించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu naidu may key announcement with bjp alliance. After union finance minister Arun jaitley press meet Chandrababu naidu held meeting with ministers on Wednesday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి