ఇస్రో ఛైర్మన్ కు లేఖ రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - శ్రీహరికోట(షార్-ఇస్రో) అందిస్తున్న సేవలను కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రకృతి వైపరిత్యాలు ఎదుర్కోవడానికి ఇస్రో అందిస్తున్న సేవలు ఎంతగానో సహాయపడుతున్నాయన్నారు.

 chandrababu naidu writes a letter to isro

'తుఫాన్లు, వరదలు వంటి విపత్తులను ముందే పసిగట్టి సరైన చర్యలు చేపట్టేందుకు ఇస్రో సేవలు తోడ్పతున్నాయి. ఇస్రో అందించిన వాతావరణ హెచ్చరికలతో డిసెంబర్ 12న వచ్చిన వార్ధా సైక్లోన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.మే నెలలో వచ్చిన వడగాల్పుల సమయంలో కూడా ఇస్రో అందించిన ముందస్తు సమాచారం ఎంతగానో ఉపయోగపడింది' అని చంద్రబాబు చెప్పారు.

'నైరుతి రుతుపవనాల సమయంలో 80 శాతం కచ్చితత్వంతో ఇస్రో అందించిన వర్షపాతం, వరదల సమాచారం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడానికి ఉపకరించింది. అక్టోబర్ 8 నుంచి 14 వరకు రాయలసీమలో కురిసిన వర్షం సమాచారం కూడా ముందస్తు చర్యలు చేపట్టడానికి దోహదం చేసింది.భవిష్యత్ లో ఇస్రోతో మరింత భాగస్వామ్యంతో పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది' అని చంద్రబాబు వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhr Pradesh CM Chandrababu Naidu wrote a letter to ISRO.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి