వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు కాదు! బీజేపీతో అవినీతి పార్టీ, అందుకే.: ఎన్డీఏపై తేల్చిన బాబు, మీడియా ప్రశ్నలతో ఇబ్బంది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. తాము ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే కారణమని అన్నారు.

Recommended Video

పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు బాబు, కాంగ్రెస్‌ను కలవడంపై సందిగ్ధం!

ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన చంద్రబాబు మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు.

 రాజకీయాల కోసం కాదు

రాజకీయాల కోసం కాదు

తన పర్యటన పూర్తిగా విభజన హామీల అమలు కోసమే తప్ప రాజకీయాల కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని జాతీయస్థాయిలో తీసుకెళ్లేందుకు ఈ పర్యటన అని చెప్పారు. జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై మాట్లాడేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు.

అవినీతి పార్టీతో బీజేపీ.. అందుకే..

అవినీతి పార్టీతో బీజేపీ.. అందుకే..

బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య సత్ససంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఓ అవినీతి పార్టీని చేరదీసినందుకే తాము బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేగాక, ప్రధాని కార్యాలయాన్ని వైసీపీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోందని ఆరోపించారు.

కేంద్రంపై ఇలా చేసింది..

కేంద్రంపై ఇలా చేసింది..

రాష్ట్రానికి ఇవ్వాల్సిన 19 పెండింగ్ అంశాలను చంద్రబాబు వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం పరిణామాలు, కేంద్రం వైఖరి, ఎన్డీఏ నుంచి బయటకు రావడానికి గల కారణాలను చంద్రబాబు తెలిపారు. కేంద్రం.. పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకుందని బాబు అన్నారు.

దక్షిణ భారతీయులం: అన్నాడీఎంకే నేతతో బాబు, కాంగ్రెస్ సహా జాతీయ పార్టీ నేతలతో భేటీలుదక్షిణ భారతీయులం: అన్నాడీఎంకే నేతతో బాబు, కాంగ్రెస్ సహా జాతీయ పార్టీ నేతలతో భేటీలు

అన్యాయంపై జాతీయ పార్టీలతో..

అన్యాయంపై జాతీయ పార్టీలతో..

కాగా, చంద్రబాబు తన రెండ్రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజైన మంగళవారం పలువురు జాతీయ పార్టీల నేతలతో కలిసి చర్చించారు. మొదట మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన చంద్రబాబు.. అనంతరం పార్లమెంటు మెట్లకు మొక్కి.. సెంట్రల్ హాల్‌లో ప్రవేశించారు. తమ రాష్ట్రానికి అండగా నిలవాలని పలు జాతీయ పార్టీ నేతలను చంద్రబాబు కోరారు.

మీడియా ప్రశ్నలతో ఇబ్బంది పడ్డ బాబు..

మీడియా ప్రశ్నలతో ఇబ్బంది పడ్డ బాబు..

కాగా, మీడియా సమావేశంలో పలువురు ప్రతినిధులు అడిగిన ప్రశ్నలతో చంద్రబాబు కొంత ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. ‘సార్.. ఏపీకి అన్యాయం జరిగిందంటున్న మీరు.. నాలుగేళ్లు బీజేపీతో ఎందుకు మిత్రులుగా ఉన్నారు? , కేంద్రం అడిగినట్లుగా రెవెన్యూ లోటు భర్తీ నిధుల లెక్కలు ఎందుకు చూపడం లేదు? మొన్నటి వరకు ప్యాకేజీ అని.. ఇప్పుడు హోదా కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి హోదా అడగడం వెనక ఆంతర్యమేంటి?' అని మీడియా ప్రతినిధులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో చంద్రబాబు కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వాట్ ఐయామ్ సేయింగ్ అంటూ వివరణ ఇచ్చారు. తాము బీజేపీని నమ్మామని, అయితే తమను మోసం చేసిందని చెప్పారు. కేంద్ర చివరి బడ్జెట్ వరకు వేచి చూసినా ఏపీకి న్యాయం జరగకపోవడంతోనే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Tuesday said that TDP exit from NDA because of BJP and YSRCP friendship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X