విభేదాలపై బాబు ఆందోళన: భూమా-శిల్పాల సయోధ్యకు అచ్చెన్నాయుడు

కర్నూలు జిల్లాకు చెందిన పాత, కొత్త టిడిపి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరోసారి టిడిపి అధినేత, సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన పాత, కొత్త టిడిపి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరోసారి టిడిపి అధినేత, సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాత, కొత్త తెలుగుదేశం పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు తలనొప్పిగా మారిన నేపథ్యంలో పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా చక్కదిద్దాలన్న ఉద్దేశంలో చంద్రబాబునాయుడు ఉన్నట్టు తెలుస్తోంది.

జిల్లాలో మొదటి నుంచి టీడీపీలో ఉన్న శిల్పా సోదరులకు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి.. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిన భూమా నాగిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి బహిరంగ రహస్యమే.

ఇప్పటికే పలు జడ్పీ సమావేశాల నుంచి, అభివృద్ధి కార్యక్రమాల వరకూ వీరి మధ్య ప్రొటోకాల్ గొడవలు, కార్యకర్తల స్థాయిలో ఆగ్రహావేశాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతుండగా, ఈ గొడవలు పార్టీకి నష్టం కలిగిస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పార్టీని చక్కదిద్దే బాధ్యతలను మంత్రి అచ్చెన్నాయుడికి ఆయన అప్పగించారు. దీంతో ఈ నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అచ్చెన్నాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది.

Chandrababu on TDP leaders clashes

ఇదిలావుండగా, అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు బాబు ఓ కమిటీని వేశారు. ఈ కమిటీలో మంత్రులు శిద్ధా రాఘవరావు, నారాయణ, ఎమ్మెల్సీ షరీఫ్ లు ఉన్నారు. మొత్తం గొడవ రహదారుల విస్తరణ కారణంగా వస్తోందని గమనించిన చంద్రబాబు.. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఉత్తరాంధ్రలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు మధ్య కూడా పలు విషయాల్లో విభేదాలు నడుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గాలు నిత్యమూ గొడవలు పడుతూనే ఉన్నాయి. ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులను సాధ్యమైనంత త్వరలో సరైన మార్గంలో పెట్టుకుంటే, త్వరలో జరిగే కార్పొరేషన్, ఆపై వరుసగా వచ్చే ఎన్నికల్లో విజయావకాశాల ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+